పిల్లాడికి పిల్లి బాడీగార్డ్... ఎంతలా సంరక్షిస్తోందో చూస్తే తెగ ఆశ్చర్యపోతారు!

ABN , First Publish Date - 2022-10-03T13:06:04+05:30 IST

పెంపుడు జంతువులు ఆ ఇంటిలోని వారిపై ప్రత్యేక ప్రేమను...

పిల్లాడికి పిల్లి బాడీగార్డ్... ఎంతలా సంరక్షిస్తోందో చూస్తే తెగ ఆశ్చర్యపోతారు!

పెంపుడు జంతువులు ఆ ఇంటిలోని వారిపై ప్రత్యేక ప్రేమను వ్యక్తం చేస్తుంటాయి. ఇంటిలోని వారి దగ్గరకు చేరి, వారిని ఆప్యాయంగా పలుకరిస్తుంటాయి. ముఖ్యంగా పెంపుడు కుక్కలు, పిల్లులు ఆ ఇంటిలోని వారిపై ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయి. తాజాగా దీనికి ఉదాహరణగా నిలుస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక పిల్లి ఒక చిన్నారి కనిపిస్తున్నారు. 


ఆ చిన్నారి బాల్కనీలోని ఒక రాడ్డు పట్టుకుని బయటకు తొంగి చూసేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనిని గమనించిన ఆ పిల్లి ఆ చిన్నారి బాల్కనీలోని రాడ్ పట్టుకుని ఎక్కడ బయటకు దూకుతాడోనని అతని ప్రయత్నాన్ని అడ్డుకోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను ట్విట్టర్ అకౌంట్ @Gabriele_Cornoలో షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు ఆ పిల్లి చేష్టలకు, ఆ పిల్లవాడి తాపత్రయానికి తెగ ముచ్చటపడుతున్నారు. అలాగే ఆ పిల్లి పిల్లవాడికి ఉత్తమ బాడీగార్డుగా వ్యవహరిస్తున్నదంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆ పిల్లి ఆ పిల్లాడికి తల్లిలాంటి ప్రేమను అందిస్తున్నదని పేర్కొన్నారు. 

Read more