-
-
Home » Prathyekam » A boyfriend who finally commits theft because his girlfriend asked for a gold chain In Bihar kjr spl-MRGS-Prathyekam
-
పర్సు కొట్టేస్తూ దొరికిపోయిన కుర్రాడు.. చితకబాదాక ఎందుకీ పని చేశావని నిలదీస్తే అతడు చెప్పింది విని నివ్వెరపోయిన జనం
ABN , First Publish Date - 2022-08-26T22:04:51+05:30 IST
ప్రేమలో (love) ఉన్న సమయంలో ప్రియురాలు (girlfriend) ఏమడిగినా తెచ్చి ఇచ్చేందుకు వెనుకాడరు. కొందరైతే ప్రియురాలిని సంతోష పెట్టడానికి.. చివరికి వివిధ నేరాలకు..

ప్రేమలో (love) ఉన్న సమయంలో ప్రియురాలు (girlfriend) ఏమడిగినా తెచ్చి ఇచ్చేందుకు వెనుకాడరు. కొందరైతే ప్రియురాలిని సంతోష పెట్టడానికి.. చివరికి వివిధ నేరాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. బీహార్‌లో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువకుడు పర్సు కొట్టేస్తూ దొరికిపోయాడు. స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాది, ఎందుకీ పని చేశావ్ అని నిలదీశారు. చివరకు ఆ యువకుడు చెప్పింది విని అంతా నివ్వెరపోయారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బీహార్ (Bihar) రాష్ట్రం పాట్నాలోని రాజా బజార్ ప్రాంతానికి చెందిన అభిషేక్ కుమార్.. ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇదిలావుండగా, గురువారం సివాన్ వైపు వెళ్తున్న రైలు ఎక్కి.. ప్రయాణికుల (Passengers) జేబుల్లో నుంచి సుమారు రూ.9వేలు కొట్టేశాడు. గమనించిన కొందరు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని.. సివాన్ చేరుకున్నాడు. అతడికి మరింత డబ్బులు అవరమై.. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో సివాన్‌లోని మార్వా పరిధిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఓ వ్యక్తి బయటకు వస్తుండగా గమనించాడు.
యాక్సిడెంట్ వల్ల రెండు కాళ్లు విరిగి మంచాన పడిన భర్త.. మూడేళ్ల తర్వాత మామను చంపించిన కోడలు.. అసలు కథేంటంటే..
అతడి వద్ద డబ్బులున్న ఉన్నట్లు గుర్తించి, అవి కూడా కొట్టేయాలని ప్లాన్ వేశాడు. అదును చూసి జేబు కత్తిరించే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న కొందరు గమనించి అతన్ని పట్టుకున్నారు. రెండో ప్రయత్నంలో మాత్రం వారి నుంచి తప్పించుకునేందుకు అతడికి సాధ్యం కాలేదు. అంతా కలిసి అతన్ని చితకబాదారు. ఎందుకీ పని చేశావని అడగ్గా.. తన ప్రియురాలు గొలుసు చేయించమని కోరిందని, అయితే అంత డబ్బులు లేకపోవడంతో దొంగతనానికి పాల్పడినట్లు వివరించాడు. చివరకు పోలీసులు అతన్ని స్థానికుల నుంచి విడిపించి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.