-
-
Home » Prathyekam » A bike suddenly caught fire while petrol was being poured in a bunk in Rajasthan kjr spl-MRGS-Prathyekam
-
పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. బైక్‌లో పెట్రోల్ పోయగానే ఎగిసిపడిన మంటలు.. అసలేం జరిగిందంటే..!
ABN , First Publish Date - 2022-10-12T21:56:33+05:30 IST
వాహనాలకు పెట్రోల్, డీజిల్ పట్టించే క్రమంలో కొన్ని సార్లు అనూహ్య ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సమయాల్లో ప్రాణ నష్టం కూడా జరుగుతుంటుంది. అయితే..

వాహనాలకు పెట్రోల్, డీజిల్ పట్టించే క్రమంలో కొన్ని సార్లు అనూహ్య ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సమయాల్లో ప్రాణ నష్టం కూడా జరుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు అదృష్టవశాత్తు కొందరు ప్రాణాలతో బయటపడుతుంటారు. ఇలాంటి అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు (Social media viral photos and videos) కొడుతుంటాయి. రాజస్థాన్‌లో తాజాగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బంక్‌లో బైక్‌కు పెట్రోల్ పట్టిస్తుండగా సడన్‌గా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రాజస్థాన్ (Rajasthan) జైసల్మేర్ పరిధి హనుమాన్ కూడలి వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. తేజువా గ్రామానికి చెందిన భూర్ సింగ్ రైతు తన తండ్రి, కుమారుడితో కలిసి బైకుపై వెళ్తున్నాడు. హనుమాన్ కూడలి వద్ద పెట్రోల్ పట్టించేందుకు బంక్‌లోకి వెళ్లాడు. సిబ్బంది పెట్రోల్ పట్టడం పూర్తయ్యే క్రమంలో కొంత పెట్రోల్ బండిపై పడడంతో సడన్‌గా మంటలు అంటుకున్నాయి. అనూహ్య ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. బైకుపై ముందువైపు కూర్చున్న బాలుడికి కూడా మంటలు అంటుకున్నాయి.
Viral Video: ట్రైన్‌కు వేళాడుతూ ఇన్‌స్టా రీల్ కోసం ఓ కుర్రాడి రిస్కీ ఫీట్.. చివరకు జరిగిందో వీడియోలో మీరే చూడండి..!

అయితే వెంటనే అప్రమత్తమైన భూర్ సింగ్, తన తండ్రి,, బైకుపై నుంచి పక్కకు వచ్చి పిల్లవాడిని కూడా పక్కకు లాక్కున్నారు. తర్వాత బాలుడికి అంటుకున్న మంటలను ఆర్పేయడంతో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. మండుతున్న బైకును బంకు సిబ్బంది అతి కష్టం మీద పక్కకు లాగేశారు. ఈ క్రమంలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే బైక్‌కు మంటలు అంటుకోగానే పెట్రోల్ పంప్‌లోని ఎమర్జెన్సీ సిస్టమ్ బటన్ ఆఫ్ అయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని బంకు యజమాని తెలిపాడు. బైకు ఇంజిన్ అప్పటికే వేడిగా ఉండడంతో.. పెట్రోల్ మీద పడగానే మంటలు అంటుకున్నాయని తెలిసింది.
gym center: జిమ్ సెంటర్‌లో శిక్షణ పేరుతో నాలుగేళ్లుగా ట్రైనర్ నిర్వాకం.. ఇటీవల ఓ యువతికి శిక్షణ ఇచ్చే క్రమంలో అతడు చేసిన పనితో..
