నెల రోజుల క్రితం యువతితో బ్యాంక్ మేనేజర్‌కు నిశ్చితార్థం.. సడన్‌గా కాబోయే భార్య నుంచి ఫోన్.. ఆమె అలా చెప్పడంతో..

ABN , First Publish Date - 2022-09-30T21:39:50+05:30 IST

అతనో బ్యాంక్ మేనేజర్. మంచి జీతం కావడంతో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఇటీవల ఓ యువతితో నిశ్చితార్థం (Engagement) కూడా జరిగింది. ఇక జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో..

నెల రోజుల క్రితం యువతితో బ్యాంక్ మేనేజర్‌కు నిశ్చితార్థం.. సడన్‌గా కాబోయే భార్య నుంచి ఫోన్.. ఆమె అలా చెప్పడంతో..
ప్రతీకాత్మక చిత్రం

అతనో బ్యాంక్ మేనేజర్. మంచి జీతం కావడంతో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఇటీవల ఓ యువతితో నిశ్చితార్థం (Engagement) కూడా జరిగింది. ఇక జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో తాజాగా కాబోయే భార్య నుంచి ఫోన్ వచ్చింది. ఆనందంగా మాట్లాడుతుందనుకున్న ఆమె.. చివరకు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో, పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాలని అతడు కన్న కలలు అన్నీ కళ్లలయ్యాయి. ఒక్కసారిగా తీవ్ర మనస్థాపానికి గురై.. సడన్‌గా ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిపోయాడు. చివరకు అతడు తీసుకున్న నిర్ణయం.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దుర్గ్ జిల్లా రాయ్‌పూర్ పరిధికి చెందిన పలాష్ అగర్వాల్ (28) అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్‌గా (Private Bank Manager) పని చేస్తున్నాడు. మంచి ఉద్యోగం కావడంతో అతడికి చాలా పెళ్లి సంబంధాలు వచ్చేవి. ఈ క్రమంలో నెల రోజుల క్రితం రాయ్‌పూర్‌కు చెందిన ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాలి అని కలలు కంటూ ఉండేవాడు. కొడుకుకు మంచి సంబంధం రావడంతో తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉండేవారు. అయితే సెప్టెంబర్ 28న యువతి తల్లిదండ్రుల నుంచి హఠాత్తుగా ఫోన్ వచ్చింది. ఎంతో ఆనందంతో ఫోన్ లిఫ్ట్ చేసిన అగర్వాల్.. కాసేపటికే షాక్ అయ్యాడు. ‘‘ఈ సంబంధం నాకు ఇష్టం లేదు.. నీతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నాను’’..  ఆమె చెప్పగానే ఒక్కసారిగా అతడికి గుండె ఆగినంత పనైంది. తీవ్ర మనస్థాపానికి గురైన అతను.. బుధవారం అంతా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోయాడు. రాత్రి ఇంట్లో చెప్పకుండా సడన్‪‌గా కారు తీసుకుని బయటికి వెళ్లిపోయాడు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది.

Viral Video: రైల్లో మొబైల్ కొట్టేయాలని చూసిన దొంగకు చుక్కలు చూపించిన ప్రయాణీకులు.. తలుపుల వద్దే బయటకు వేళాడదీసి..


అంతా కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఎక్కడా కనిపించలేదు. గ్రామ సమీపంలోని నది వంతెన వద్ద కారు పార్కు చేసి ఉండడాన్ని గురువారం ఉదయం గమనించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. కారులో తనిఖీ చేయగా.. రెండు ఫోన్లు, ఓ తాడు కనిపించింది. నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అనుమానంతో గజ ఈతగాళ్లను పిలిపించి వెతికించారు. చివరికి అగర్వాల్ మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మౌనంగా ఉంటే మనసు బాలేదు అనుకున్నామే గానీ.. ఇంతటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదంటూ.. యువకుడి తల్లిదండ్రులు బోరున విలపించారు. అగర్వాల్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీనివాస రామానుజన్ మళ్లీ పుట్టారా..? ఈ బాలుడు చదివేది 3వ తరగతే.. కానీ పదో తరగతి విద్యార్థులకు కూడా లెక్కల పాఠాలు..! Read more