ఫోన్ వచ్చిందని రాత్రి 10 గంటలకు బయటకు వెళ్లిన భర్త.. కాసేపటికే ఫోన్ స్విచాఫ్.. చివరకు మామిడి తోటలో షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2022-06-15T18:32:47+05:30 IST

ఆ వ్యక్తి తన భార్య, ఐదుగురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.. ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఫోన్ వచ్చిందని రాత్రి 10 గంటలకు బయటకు వెళ్లిన భర్త.. కాసేపటికే ఫోన్ స్విచాఫ్.. చివరకు మామిడి తోటలో షాకింగ్ సీన్..!

ఆ వ్యక్తి తన భార్య, ఐదుగురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.. ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. మంగళవారం రాత్రి 10 గంటలకు అతనికి ఫోన్ వచ్చింది.. బయటకు వెళ్లిన ఆ వ్యక్తి ఎంతసేపటికీ తిరిగి రాలేదు.. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది.. తర్వాతి రోజు ఉదయం గ్రామస్థులందరూ కలిసి వెతగ్గా ఓ మామిడి చెట్టు కింద అతని మృతదేహం లభ్యమైంది.. శరీరం నిండా బోలెడన్ని గాయాలున్నాయి.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. 


ఇది కూడా చదవండి..

సరిగ్గా నెల రోజుల క్రితం పెళ్లి.. కొత్త కోడలికి టీ చేసి ఇచ్చిన అత్త.. క్షణాల్లోనే ఇంట్లో ఊహించని సీన్..!


ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు సమీపంలోని బహరంపూర్ గ్రామానికి చెందిన ఇన్సాఫ్ అలీ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో ఉన్న అతనికి ఫోన్ కాల్ వచ్చింది. కాసేపట్లో వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి అతను బయటకు వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ ఇన్సాఫ్ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. తర్వాతి రోజు ఉదయం గ్రామస్తులందరూ ఇన్సాఫ్ కోసం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికారు. చివరకు గ్రామానికి సమీపంలో ఉన్న ఓ మామిడి తోటలో ఇన్సాఫ్ మృతదేహం లభ్యమైంది. షాకైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. 


ఇన్సాఫ్‌పై ఎవరో కత్తితో దాడి చేసినట్టు శరీరంపై గాయలను బట్టి తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ఇన్సాఫ్ మృతదేహం ఉన్న మామిడి చెట్టు కొంద బోలెడన్ని మామిడి కాయలు కనిపించాయి. కాగా, ఇన్సాఫ్ మృతికి వివాహేతర సంబంధమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి ఇన్సాఫ్‌కు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 


Updated Date - 2022-06-15T18:32:47+05:30 IST