-
-
Home » Prathyekam » A 15yearold boy committed suicide by writing a letter saying World Best Gift on his mothers birthday In Rajasthan kjr spl-MRGS-Prathyekam
-
World Best Gift.. అంటూ లేఖ రాసి మరీ తల్లి పుట్టిన రోజు నాడే 15 ఏళ్ల కొడుకు బలవన్మరణం.. చిన్న కారణానికే..
ABN , First Publish Date - 2022-07-17T00:13:55+05:30 IST
జీవితం చాలా విలువైనది.. ఒక్కసారి కోల్పోతే మళ్లీ రాదనే విషయం తెలిసినా, చాలా మంది చిన్న చిన్న కారణాలకే నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తుంటారు. తద్వారా..

జీవితం చాలా విలువైనది.. ఒక్కసారి కోల్పోతే మళ్లీ రాదనే విషయం తెలిసినా, చాలా మంది చిన్న చిన్న కారణాలకే నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తుంటారు. తద్వారా కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతుంటారు. రాజస్థాన్‌లో విషాధ ఘటన చోటు చేసుకుంది. World Best Gift.. అంటూ 15ఏళ్ల బాలుడు తన తల్లి పుట్టిన రోజున లేఖ రాశాడు. అనంతరం బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేవలం చిన్న కారణానికే ఆత్మహత్య(suicide) చేసుకున్నాడని తెలుసుకుని.. అంతా అయ్యో! ఇంత చిన్న కారణానికి ఎందుకిలా చేశాడంటూ.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం ఆల్వార్ పరిధి బెహ్రోద్‌లోని భగవాది ఖుర్ద్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న కంచన్ అనే మహిళ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. భర్త చనిపోవడంతో ఆ ఉద్యోగం ఈమెకు వచ్చింది. ప్రస్తుతం ఈమె బెహ్రూర్‌లోని 2వ వార్డులోని ఓ అద్దె గదిలో కుమారుడు రోహిత్ (15)తో కలిసి నివాసం ఉంటోంది. ఈమె కూతురు మేనమామ వద్ద ఉంటోంది. రోహిత్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఇదిలావుండగా, ఇటీవల కొద్ది రోజుల నుంచి స్కూల్ యూనిఫాం కావాలంటూ రోహిత్ తన తల్లిని పదే పదే అడుగుతుండేవాడు. కొనిస్తాలే అంటూ ఆమె కూడా సర్దిచెప్పింది. కొన్నిసార్లు విసుగొచ్చి కొడుకును కోపంతో మందలించేది.
కూతుర్ని డాక్టర్‌ను చెయ్.. ఆర్మీకి మాత్రం పంపకు.. అంటూ భార్యకు చివరి వీడియో.. ఓ సైనికుడి ఆత్మహత్య కేసులో..

ఈ క్రమంలో శుక్రవారం కంచన్ పుట్టిన రోజు కావడంతో.. పొద్దునే తల్లికి శుభాకాంక్షలు తెలియజేశాడు. అలాగే స్కూల్ నుంచి వచ్చాక.. యూనిఫాం కొనివ్వాలని కోరాడు. ఇందుకు కంచన్ కూడా సరే అని ఒప్పుకొంది. స్కూల్లో విద్యార్థులంతా కంచన్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. దీంతో ఆమె ఇంటికి ఆలస్యంగా చేరుకుంది. అయితే ఇంటి బయట తలుపులు మూసి ఉండడంతో పాటూ పిలిచినా కొడుకు పలకకపోవడంతో అనుమానం వచ్చింది. ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా.. లోపల కుమారుడు ఉరికి వేలాడుతూ కనిపించాడు.
18 ఏళ్లుగా పోరాటం.. రిటైర్మెంట్ డబ్బులకై తిరిగీ తిరిగీ విసుగొచ్చి ఆ వృద్ధుడు తీసుకున్న నిర్ణయమిదీ..!
దీంతో ఆమె ఒక్కసారిగా కొడుకు మృతదేహంపై పడి బోరున విలపించింది. సూసైడ్ నోట్‌లో World Best Gift.. happy birthday mummy.. అని రాసి ఉండడం చూసి.. స్థానికులంతా కన్నీటిపర్యంతమయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని కూడా విచారించే పనిలో పడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.