House For Rent.. అనే ప్రకటన చూసి ఓ వ్యక్తి నుంచి ఫోన్‌.. యజమానురాలి ఒక్క మిస్టేక్‌తో రూ.లక్షకు పైగానే..

ABN , First Publish Date - 2022-05-23T21:58:21+05:30 IST

ఆమె వృద్ధురాలు. తన ఇంటిని అద్దెకు ఇవ్వాలని.. అందె ద్వారా వచ్చే డబ్బులు ఏదో ఒక దానికి ఉపయోగపడుతాయని భావించింది. ఈ క్రమంలోనే ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు ప్రకటన విడుదల చేసింది. దాన్ని చూసి

House For Rent.. అనే ప్రకటన చూసి ఓ వ్యక్తి నుంచి ఫోన్‌.. యజమానురాలి ఒక్క మిస్టేక్‌తో రూ.లక్షకు పైగానే..

ఇంటర్నెట్ డెస్క్: ఆమె వృద్ధురాలు. తన ఇంటిని అద్దెకు ఇవ్వాలని.. అందె ద్వారా వచ్చే డబ్బులు ఏదో ఒక దానికి ఉపయోగపడుతాయని భావించింది. ఈ క్రమంలోనే ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు ప్రకటన విడుదల చేసింది. దాన్ని చూసి ఆమెకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. అద్దెకు తీసుకోవడానికి రెడీ అంటూ నమ్మించాడు. చివరకు ఆమెకు కుచ్చిటోపి పెట్టాడు. రూ. లక్షకుపైగా సొమ్ము కాజేశాడు. ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


డెహ్రాడూన్‌కు చెందిన 72ఏళ్ల వృద్ధురాలు తన ప్రాపర్టీలోని ఓ ఇంటిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ప్రముఖ వెబ్‌సైట్‌ ద్వారా ‘ఇల్లు అద్దెకు ఇవ్వబడును’ అనే ప్రకటనను విడుదల చేసింది. అంతేకాకుండా ఫోన్ నెంబర్ ఇచ్చి.. ఆసక్తిగల వారు తనను సంప్రదించాలని సూచించింది. ప్రకటన ఇచ్చి 10 రోజులు గడిచిపోయిన అనంతరం తాజాగా ఆమెకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఆ ఇంటిని తాను అద్దెకు తీసుకుంటానని ఆమెను నమ్మించాడు. 



అద్దెకు సంబంధించిన అడ్వాన్సు పంపేందుకు బ్యాంకు వివరాలు ఇవ్వాలని కోరాడు. అయితే తనకు ఇంటర్నెట్ బ్యాకింగ్ గురించి అంతా తెలియదు అని ఆమె అతడికి చెప్పింది. దీంతో హెల్ప్ చేస్తానని మాయమాటలు చెప్పాడు. బ్యాంకు వివరాలు, ఓటీపీ తదితర సమాచారం తీసుకుని.. చివరకు ఆమె అకౌంట్ నుంచి రూ.1.16లక్షలు కాజేశాడు. అయితే తాను మోసపోయానన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించింది. దీంతో వెంటనే పోలీసులను సంప్రదించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 


Updated Date - 2022-05-23T21:58:21+05:30 IST