Super Star Krishna: 60 ఏళ్ల క్రితం నాటి కృష్ణ మురళి మోహన్ ఫోటో వైరల్

ABN , First Publish Date - 2022-11-17T17:37:46+05:30 IST

సీనియర్ నటుడు మురళి మోహన్ మరియు కృష్ణ గారు క్లాస్ మేట్స్. వాళ్ళు 1958-60 మధ్య డాక్టర్ సి ఆర్ రెడ్డి కాలేజీ, ఏలూరు లో చదివారు. ఆ ఫోటో ఒకటి వైరల్ గా తిరుగుతోంది.

Super Star Krishna: 60 ఏళ్ల క్రితం నాటి కృష్ణ మురళి మోహన్ ఫోటో వైరల్
Krishna and Murali Mohan are circled in the picture

సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ (Superstar Krishna) గారు బుధవారం నాడు అశేష అభిమానుల అశ్రు నాయనల మధ్య భువి నుండి దివి కి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అయితే కృష్ణ గారు ఇప్పుడు లేకపోయినా అతని జ్ఞాపకాలు ఫోటోల, చిత్రాల రూపం లో కళ్ల ముందు మెదులాడుతూనే వుంటాయి. అలాగే కృష్ణ గారి తో పరిచయం వున్న కొంత మంది వ్యక్తులు అతనితో చదువుకున్న వారు తమ తమ జ్ఞాపకాలని ఫోటోల రూపం లో ఒక్కొక్కటి బయట పెడుతున్నారు. అలాంటిదే ఒక అరుదయిన ఫోటో ఒకటి వైరల్ అయింది. సీనియర్ నటుడు మురళి మోహన్ మరియు కృష్ణ గారు క్లాస్ మేట్స్, అలాగే ఒకే బెంచ్ లో కూడా కూర్చున్నారు కూడా. వాళ్ళు 1958-60 మధ్య డాక్టర్ సి ఆర్ రెడ్డి కాలేజీ, ఏలూరు లో చదివారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ చదివిన ఆ బ్యాచ్ ఫోటో ఒకటి వైరల్ గా తిరుగుతోంది. అందులో మురళి మోహన్, కృష్ణ ఇద్దరే చాలామందికి తెలిసిన వాళ్ళు. ఇది మురళి మోహన్ దగ్గర వున్న ఫోటో అని, అతను మొన్న కృష్ణ గారు చనిపోయినప్పుడు, జ్ఞాపకాల రూపం లో ఈ ఫోటో ని బయటకి ఇచ్చారని తెలిసింది. మురళి మోహన్ (Murali Mohan) బ్యాచ్ మేట్ అయినా కూడా ఆ స్నేహాన్ని సినిమా పరిశ్రమలోనూ చివరి దాకా కంటిన్యూ చేశారు. మురళి మోహన్ తను స్థాపించిన జయభేరి ప్రొడక్షన్ లో కృష్ణ తో, మహేష్ బాబు తో సినిమాలు చేశారు. వాళ్ళిద్దరి అనుబంధం అలాగే కొనసాగింది, అందుకే మురళి మోహన్ కృష్ణ గారిని మహాప్రస్థానికి తీసుకు వెళ్లేటప్పుడు మోసిన వారిలో వున్నారు. వాళ్ళిద్దరి ప్రేమ, స్నేహం అటువంటిది మరి. (Krishna and Murali Mohan are batchmates at 1958-60 at Dr C R Reddy College, Eluru and their batch photo is now going viral on social media)

Updated Date - 2022-11-17T20:47:54+05:30 IST