Ayodhya: రామ జన్మభూమి వద్ద నలుగురు కానిస్టేబుళ్ల డ్యాన్స్.. తర్వాత ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-12-16T13:28:17+05:30 IST
అయోధ్యలోని రామ జన్మభూమిని పవిత్ర క్షేత్రంగా హిందువులు భావిస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న నలుగురు మహిళా కానిస్టేబుళ్లు.. ఆ విషయాన్ని..
ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య(Ayodhya)లోని రామ జన్మభూమిని పవిత్ర క్షేత్రంగా హిందువులు భావిస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న నలుగురు మహిళా కానిస్టేబుళ్లు.. ఆ విషయాన్ని మరిచిపోయినట్టున్నారు. భోజ్‌పూరి సాంగ్ పెట్టుకుని.. పవిత్ర ప్రాంగణంలో డ్యాన్స్ స్టెప్పు(Constables)లేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆ వీడియో కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు. కవితా పటేల్, కామినీ కుష్వాహా, కాశిష్ సాహ్ని, సంధ్యా సింగ్ అనే కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.