చాణక్యనీతి : ఈ నాలుగు అంశాలు లోకంలో అత్యంత ఉత్కృష్టం... వీటికి మించినవి మరేమీలేవు!

ABN , First Publish Date - 2022-06-09T11:29:28+05:30 IST

చాణక్య నీతిలో ఆచార్య ఒక శ్లోకంలో నాలుగు...

చాణక్యనీతి : ఈ నాలుగు అంశాలు లోకంలో అత్యంత ఉత్కృష్టం... వీటికి మించినవి మరేమీలేవు!

చాణక్య నీతిలో ఆచార్య ఒక శ్లోకంలో నాలుగు అంశాలను అత్యుత్తమమైనవిగా పేర్కొన్నాడు. అవి ప్రపంచంలోనే ఎంతో ప్రాధాన్యత కలిగినవని తెలిపాడు. ఆచార్య చాణక్య ఈ 4 విషయాల కంటే గొప్పవి ప్రపంచంలో ఏవీలేవని నమ్మాడు. ఆ శ్లోకానికున్న అర్థం ప్రకారం ఏ దానమూ అన్నదానమంత గొప్పది కాదు. ఏ తిథి ద్వాదశితో సమానం కాదు. ఏ మంత్రం గాయత్రితో సమానం కాదు, ఏ దేవుడూ తల్లితో సమానం కాదు. ఈ శ్లోకం ద్వారా ఆచార్య చాణక్యుడు ప్రపంచంలో అన్నదానానికి మించిన మరో ఘనమైన దానం లేదని చెప్పాడు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అన్నదానం చేయాలని సూచించాడు. 


ఆచార్య చాణక్యుడు సంస్కృతంలో ద్వాదశి అని పిలువబడే క్యాలెండర్‌లోని పన్నెండవ తిథి కంటే గొప్ప తిథి మరొకటి లేదని నమ్మాడు. ఈ తిథి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. విష్ణువును ప్రసన్నం చేసుకుంటే జీవితంలో బాధలు ఉండవు. విష్ణువు లోక రక్షకుడు. మంత్రాన్ని పఠించాలంటే గాయత్రీ మంత్రాన్ని జపించాలని ఆచార్య విశ్వసించారు. ఇంతకంటే శక్తివంతమైన, ప్రభావవంతమైన మంత్రం మరొకటి లేదన్నారు. గాయత్రీ మంత్రం ఒక వ్యక్తికి సంపద, అధికారం, కీర్తిని ఇస్తుందన్నారు. సంబంధబాంధవ్యాల గురించి మాట్లాడినట్లయితే ఆచార్య ఈ ప్రపంచంలో తల్లిని మించిన ఉత్తమ సంబంధం లేదని నమ్మాడు. ఒక తల్లి తన బిడ్డ సంతోషం కోసం అన్నీ సమకూరుస్తుంది. అందుకే తల్లిని దైవంగా భావిస్తారు. తల్లికి సేవ చేసి, ఆమె ఆశీస్సులు అందుకుంటే భగవంతుని ఆశీస్సులు లభించినట్లేనని ఆచార్య తెలిపారు. Updated Date - 2022-06-09T11:29:28+05:30 IST