ఇంగ్లీష్‌లో 35, లెక్కల్లో 36.. వైరల్ అవుతున్న కలెక్టర్ పదో తరగతి మార్కుల లిస్ట్!

ABN , First Publish Date - 2022-06-14T20:55:06+05:30 IST

పరీక్షల్లో వచ్చే మార్కుల పైనే ఒక విద్యార్థి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు.

ఇంగ్లీష్‌లో 35, లెక్కల్లో 36.. వైరల్ అవుతున్న కలెక్టర్ పదో తరగతి మార్కుల లిస్ట్!

పరీక్షల్లో వచ్చే మార్కుల పైనే ఒక విద్యార్థి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. పరీక్షల్లో మంచి మార్కులు రాకపోతే ఇక జీవితమే లేదని కొందరు విద్యార్థులు నిరాశకు లోనై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ ఆలోచనా ధోరణిని మార్చేందుకు ఓ ఐఏఎస్ అధికారి చిరు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం  గుజరాత్‌లో భరూఛ్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తుషార్ డి సుమేరా పదో తరగతి మార్కులు జాబితాను ట్విటర్‌లో షేర్ చేశారు. తుషార్ కేవలం పాస్ మార్కులతో పదో తరగతి గట్టెక్కారు. ఈ మార్కుల లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఇది కూడా చదవండి..

ఏనుగులు కూడా పగబడతాయా..? ఓ మహిళను చంపి.. వెతుక్కుంటూ ఊళ్లోకి వచ్చి మరీ ఆమె ఇంటిని కూల్చి..


గుజరాత్‌లో భరూఛ్ జిల్లా కలెక్టర్ తుషార్ డి సుమేరా పదో తరగతిలో కేవలం పాస్ మార్కులు మాత్రమే సాధించారు. ఇంగ్లీష్‌లో 35, లెక్కల్లో 36 మార్కులు మాత్రమే వచ్చాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆయన కలెక్టర్ అయ్యారు. సుమేరా మార్కుల లిస్ట్‌‌ను ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విటర్‌లో షేర్ చేశారు. త‌క్కువ‌ మార్కులొచ్చాయ‌ని బాధపడే విద్యార్థులకు ఈ కలెక్టర్ కథ స్ఫూర్తిగా నిలుస్తుందని శరణ్‌ అభిప్రాయపడ్డారు. ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తుషార్ సుమేరా 2012లో ఐఏఎస్ అధికారి అయ్యారు. యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు ఆయన పాఠశాల ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. Updated Date - 2022-06-14T20:55:06+05:30 IST

Read more