32 ఏళ్ల మహిళకు 16 ఏళ్ల బాలుడిని ఇచ్చి పెళ్లి చేసిన పంచాయతీ పెద్దలు.. బాలుడి తల్లిదండ్రులకు తెలియడంతో..
ABN , First Publish Date - 2022-05-27T17:07:52+05:30 IST
ఆ మహిళ అప్పటికే వివాహిత.. భర్తకు విడాకులు ఇచ్చేసి ఒంటరిగా నివసిస్తోంది..

ఆ మహిళ అప్పటికే వివాహిత.. భర్తకు విడాకులు ఇచ్చేసి ఒంటరిగా నివసిస్తోంది.. ఆమెకు, ఓ 16 ఏళ్ల బాలుడికి గ్రామ పంచాయతీ పెద్దలు రహస్యంగా పెళ్లి చేశారు.. ఆ విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలిసింది.. దీంతో బాలుడి తండ్రి వెంటనే చైల్డ్ ప్రొటక్షన్ కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.. పోలీసులు వచ్చే సరికి ఆ బాలుడిని తీసుకుని ఆ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు అదృశ్యమయ్యారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.. పంచాయతీ ప్రెసిడెంట్‌ను అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి..
చిన్న సర్జరీ సరిపోతుందనుకున్నారు.. కానీ చివరకు కోమాలోకి.. ఏడేళ్లుగా ఆమెకు ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్.. ఎంత ఖర్చు అయిందంటే..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు సమీపంలోని సింగ్రౌలీకి చెందిన బాధిత బాలుడి తండ్రికి, ఆ గ్రామ సర్పంచ్ బాల్ ముకుంద్‌కు మధ్య మనస్పర్థలు ఉన్నాయి. దాంతో బాలుడి కుటుంబంపై పగ తీర్చుకోవాలనుకుని ఆ గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న 32 ఏళ్ల మహిళను రంగంలోకి దింపాడు. 16 ఏళ్ల ఆ బాలుడు తన వైపు కామంతో చూస్తున్నాడని ఆరోపిస్తూ నిందిత మహిళ పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రెసిడెంట్ బాల్ ముకుంద్ పంచాయతీ నిర్వహించి ఆ బాలుడికి, మహిళకు పెళ్లి చేసేశాడు. తర్వాత విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు చైల్డ్ ప్రొటక్షన్ కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
చైల్డ్ ప్రొటక్షన్ కమిషన్ సభ్యులు పోలీసులతో సహా గ్రామానికి చేరుకుని నిందితుల కోసం అన్వేషణ సాగించారు. అప్పటికే ఆ బాలుడిని తీసుకుని నిందిత మహిళ, ఆమె కుటుంబ సభ్యులు పరారయ్యారు. దీంతో ప్రెసిడెంట్‌పై, నిందిత మహిళ కుటుంబంపై పోలీసులు కిడ్నాప్ కేసు, పోక్సో చట్టం కింద మరో కేసు పెట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.