వారిద్దరూ విచిత్ర దంపతులు.. ఆమెకు 25.. అతనికి 71.. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందంటే..

ABN , First Publish Date - 2022-05-29T09:32:58+05:30 IST

ప్రపంచంలో చాలా మంది దంపతుల మధ్య వయసు వ్యత్యాసం చూస్తూ ఉంటాం. వాటిలో చాలామంది డబ్బుకోసం ఇలాంటి వివాహాలు చేసుకునేవారుంటారు. కానీ డబ్బుతో సంబంధం లేకుండా ఒక యువతి(25) ఒక వృద్ధుడి(71)ని ప్రేమించి...

వారిద్దరూ విచిత్ర దంపతులు.. ఆమెకు 25.. అతనికి 71.. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందంటే..

ప్రపంచంలో చాలా మంది దంపతుల మధ్య వయసు వ్యత్యాసం చూస్తూ ఉంటాం. వాటిలో చాలామంది డబ్బుకోసం ఇలాంటి వివాహాలు చేసుకునేవారుంటారు. కానీ డబ్బుతో సంబంధం లేకుండా ఒక యువతి(25) ఒక వృద్ధుడి(71)ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. వీరి మధ్య ప్రేమకు ఒక విచిత్ర కారణముంది.


వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫిలడాల్ఫియా ప్రాంతంలో నివసించే డానియల్(25) అనే యువతి గత కొన్ని సంవత్సరాలుగా ఒక విచిత్ర వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు కండరాలు, ఎముకల్లో తరుచూ నొప్పి ఉండేది. త్వరగా అలసిపోయేది. ఏమి తినాలనిపించేది కాదు. అయినా డేనియల్ బరువు పెరుగుతూ ఉండేది. నొప్పి వలన తనకు సరిగా నిద్రపట్టేదికాదు. చికిత్స కోసం డానియల్ చాలా మంది డాక్టర్లకు చూపించినా ఫలితం లభించలేదు. ఈ క్రమంలో డానియల్ రేకీ అనే చికిత్స గురించి తెలుసుకుంది. 


రేకీ చికిత్స తీసుకునేందుకు డానియల్ రేకీ నిపుణుడు హావర్డ్‌ని సంప్రదించింది. హావర్డ్ ఆమె పరిస్థితి గమనించి నాలుగు వారాల పాటు చికిత్స చేశాడు. అలా హావర్డ్‌తో డానియల్ సమయం గడిపుతూ అతనికి దగ్గరైంది. కొన్ని రోజుల తరువాత డానియల్ ఆరోగ్యం మెరుగుపడింది. తను పూర్తిగా కోలుకుంది. ఇక డానియల్‌కు ఎలాంటి నొప్పి ఉండేది కాదు. తను ప్రశాంతంగా నిద్రపోయేది. తన సమస్యకు అద్భుతంగా పరిష్కారం చూపిన హావర్ద్ అంటే డానియల్ ఇష్టం కలిగింది. 


ఒకరోజు డానియల్.. హావర్డ్ వద్దకు వెళ్లి తను అతడిని ప్రేమిస్తున్నట్లు చెప్పింది. హావర్ద్‌కు కూడా ఆమె అంట ఇష్టం. అందుకే ఆమె ప్రేమను అంగీకరించాడు. ఇద్దరూ కలిసి కొంత కాలం సహజీవనం చేశారు. కానీ వారి ప్రేమను ఇద్దరి కుటుంబాలు అంగీకరించలేదు. అయినా ఈ విచిత్ర ప్రేమికులు వారిని పట్టించుకోకుండా హాయిగా కలిసి జీవిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ ఇద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. ఈ ఇద్దరి గురించి సోషల్ మీడియాలో నెటిజెన్లు రకరకాలుగా నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.


Read more