55 ఏళ్ల వ్యక్తి దారుణ హత్య.. 19 ఏళ్ల కుర్రాడి పనేనని తేల్చిన పోలీసులు.. విచారణలో వీళ్ల గురించి అసలు నిజం తెలిసి..

ABN , First Publish Date - 2022-05-19T20:30:13+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌కు చెందిన ఓ 55 ఏళ్ల వ్యక్తి గత సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు..

55 ఏళ్ల వ్యక్తి దారుణ హత్య.. 19 ఏళ్ల కుర్రాడి పనేనని తేల్చిన పోలీసులు.. విచారణలో వీళ్ల గురించి అసలు నిజం తెలిసి..

మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌కు చెందిన ఓ 55 ఏళ్ల వ్యక్తి గత సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు.. రోడ్డుపై పడి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.. మూడ్రోజుల విచారణ అనంతరం ఆ హత్య వెనకున్న షాకింగ్ కారణాన్ని బయటపెట్టారు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి..

బంగారం వ్యాపారి మిస్సింగ్.. కాల్ డేటాలో చివరగా ఓ మహిళకు ఫోన్.. పోలీసులు ఆమె ఇంట్లో తనిఖీ చేస్తే..


దామోహ్‌కు చెందిన బాబూ ఖాన్ అనే వ్యక్తి సోమవారం రాత్రి హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు 19 ఏళ్ల కుర్రాడిని నిందితుడిగా తేల్చారు. పోలీసుల సమాచారం ప్రకారం.. స్వలింగ సంపర్కుడైన బాబూ ఖాన్‌ ఆ 19 ఏళ్ల కుర్రాడితో శృంగారం సాగించేవాడు. అనంతరం ఆ కుర్రాడికి డబ్బులిచ్చేవాడు. ఎప్పటిలాగానే సోమవారం రాత్రి కూడా ఆ కుర్రాడితో బాబూ ఖాన్ శృంగారం చేశాడు. అయితే డబ్బులు ఇవ్వలేదు. 


డబ్బుల గురించి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆ కుర్రాడు కూరగాయలు కోసే కత్తితో బాబూ ఖాన్‌ను పొడిచేసి పరారయ్యాడు. బాబూ ఖాన్‌తో తరచుగా కనిపించే ఆ కుర్రాడు హత్య జరిగిన తర్వాత మాయమవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతడిని పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆ 19 ఏళ్ల కుర్రాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.  


Updated Date - 2022-05-19T20:30:13+05:30 IST