తల్లిదండ్రులను చంపేసి ఇంట్లోనే పూడ్చేసిన కొడుకు.. ఎందుకు అలా చేశాడో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-03-05T22:51:32+05:30 IST

అతను తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు.. మూడ్రోజుల క్రితం అతను తల్లిదండ్రులను చంపేసి ఇంట్లోనే గొయ్యి తవ్వి పూడ్చేశాడు..

తల్లిదండ్రులను చంపేసి ఇంట్లోనే పూడ్చేసిన కొడుకు.. ఎందుకు అలా చేశాడో తెలిస్తే షాక్!

అతను తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు.. మూడ్రోజుల క్రితం అతను తల్లిదండ్రులను చంపేసి ఇంట్లోనే గొయ్యి తవ్వి పూడ్చేశాడు.. గురువారం సాయంత్రం అత్తగారింటి నుంచి వచ్చిన పెద్దకొడుకు తల్లిదండ్రుల కోసం వెతికాడు.. తమ్ముడిని అడిగితే తనకు తెలియదన్నాడు.. ఇంట్లో దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. వారు వచ్చి విచారించడంతో అసలు విషయం బయటపడింది. 


ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌కు చెందిన జైరామ్ సింగ్, సుందరీ బాయి దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు హేమంత్ వివాహం తర్వాత అత్తారింట్లోనే ఉంటున్నాడు. 17 ఏళ్ల చిన్న కొడుకుతో కలిసి వారిద్దరూ స్వగ్రామంలో నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం హేమంత్ ఇంటికి వచ్చి చూస్తే తల్లిదండ్రులు కనిపించలేదు. సోదరుడిని అడిగితే అతను తనకేం తెలియదన్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడం హేమంత్ గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వారు హేమంతో సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. 


తల్లిదండ్రులను తానే చంపేసి ఇంట్లో గొయ్యి తవ్వి పూడ్చేశానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. తన తల్లిదండ్రులు ఎప్పుడూ అన్నయ్యనే ప్రేమగా చూసేవారని, తనను ఎప్పుడూ పట్టించుకోలేదని, ఎప్పుడూ తిడుతూ ఉండేవారని, అందుకే కోపంలో వారిని చంపేశానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. కాగా, నిందితుడి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని పోలీసులు భావిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

Read more