ఆమెకు 16 ఏళ్లు.. అతడికి 20 ఏళ్లు.. అసలు నిజాలివే అంటూ వీడియోలో ప్రేమ జంట చెప్పిన విషయాలివి..!

ABN , First Publish Date - 2022-04-28T18:33:43+05:30 IST

ఆ బాలికకు 16 ఏళ్లు.. యువకుడికి 20 ఏళ్లు.. ఇద్దరు చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు..

ఆమెకు 16 ఏళ్లు.. అతడికి 20 ఏళ్లు.. అసలు నిజాలివే అంటూ వీడియోలో ప్రేమ జంట చెప్పిన విషయాలివి..!

ఆ బాలికకు 16 ఏళ్లు.. యువకుడికి 20 ఏళ్లు.. ఇద్దరు చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు.. రెండు నెలల క్రితం ఆ బాలిక గర్భం దాల్చింది.. పెళ్లికి ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో ఆ బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయి తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది.. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. తమ కూతురిని ఓ యువకుడు కిడ్నాప్ చేశాడని కంప్లైంట్ చేశారు.. దీంతో ఆ ప్రేమ జంట ఓ వీడియో రూపొందించి విడుదల చేసింది. 


బీహార్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. పెళ్లికి ఆ బాలిక తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఆ బాలిక ఇంటి నుంచి పారిపోయి తన ప్రియుడిని ఓ గుళ్లో పెళ్లి చేసుకుంది. ఆగ్రహం చెందిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురిని ఓ యువకుడు కిడ్నాప్ చేశాడని కంప్లైంట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించడంతో ఆ ప్రేమ జంట ఓ వీడియో రూపొందించి విడుదల చేసింది.


`నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. నాకు ఇష్టమైన వ్యక్తిని గుళ్లో పెళ్లి చేసుకున్నాను. నేనిప్పుడు గర్భవతిని. నా పెళ్లి తల్లిదండ్రులకు, అన్నయ్యకు ఇష్టం లేదు. నేను ఇంటి నుంచి వచ్చేటపుడు డబ్బు, బంగారం తీసుకెళ్లిపోయానని నా తల్లిదండ్రులు అంటున్నారు. అది పూర్తిగా అబద్ధం. నేను పోలీస్ స్టేషన్‌కు వచ్చి పూర్తి వివరాలు తెలియజేస్తాన`ని బాలిక వీడియోలో పేర్కొంది. కాగా, ఆ ఇద్దరి కోసం పోలీసులు అన్వేషణ సాగిస్తున్నారు. 

Updated Date - 2022-04-28T18:33:43+05:30 IST