Cycle Polo Player Death: సైకిల్ పోలో పోటీల కోసం నాగ్‌పూర్ వెళ్లిన పదేళ్ల బాలిక.. ఒక్క ఇంజక్షన్ ఎంత పని చేసిందంటే..

ABN , First Publish Date - 2022-12-23T19:42:13+05:30 IST

ఎన్నో ఆశలతో ఆశయాలతో సైకిల్ పోలో ఛాంపియన్ షిప్‌ (Cycle Polo Championship) కోసం నాగ్‌పూర్‌లో అడుగు పెట్టిన 10 ఏళ్ల కేరళ బాలిక (Kerala Cycle Polo Player Death) హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయింది.

Cycle Polo Player Death: సైకిల్ పోలో పోటీల కోసం నాగ్‌పూర్ వెళ్లిన పదేళ్ల బాలిక.. ఒక్క ఇంజక్షన్ ఎంత పని చేసిందంటే..

ఎన్నో ఆశలతో ఆశయాలతో సైకిల్ పోలో ఛాంపియన్ షిప్‌ (Cycle Polo Championship) కోసం నాగ్‌పూర్‌లో అడుగు పెట్టిన 10 ఏళ్ల కేరళ బాలిక (Kerala Cycle Polo Player Death) హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయింది. కేరళలోని అలప్పుజాకు చెందిన సైకిల్ పోలో క్రీడాకారిణి నిదా ఫాతిమా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నాగ్‌పూర్ (Nagpur) లో జరుగుతున్న జాతీయ సైకిల్ ఛాంపియన్ షిప్ అండర్-14 పోటీల్లో నిదా పాల్గొనాల్సి ఉంది. ఈ పోటీల కోసం నిదా కొన్ని రోజుల క్రితమే నాగ్‌పూర్ చేరుకుంది. బుధవారం రాత్రి ఉన్నట్టుండి ఆమె ఆరోగ్యం పాడైంది. వరుసగా వాంతులు చేసుకుంది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స అందుకుంటూ నిదా ప్రాణాలు విడిచింది. కోచ్ చెప్పిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం నిదాకు వాంతులు మొదలయ్యాయి. కొన్ని మందులు వేసుకున్నప్పటికీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో గురువారం ఉదయం ఆ బాలికను కోచ్ స్థానిక శ్రీ కృష్ణా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ ఆమెకు Ondansetron అనే ఇంజక్షన్ ఇచ్చారు. ఇంజక్షన్ చేసిన కొద్ది సేపటికే నిదాకు చేతిలో నొప్పి మొదలైంది. ఆ తర్వాత ఆమె ముక్కు నుంచి రక్తం వచ్చింది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే నిదా కన్ను మూసింది. నిదా అనుమానాస్పద మృతిపై కేరళ సైకిల్ పోలో అసోషియేషన్, నాగ్‌పూర్ పోలసులు విచారణ ప్రారంభించారు.

Updated Date - 2022-12-23T19:42:15+05:30 IST