ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 16 ఏళ్ల బాలిక.. దగ్గరకు తీసి ఏమైందని పోలీసులు అడిగితే ఆమె చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-09-20T22:53:37+05:30 IST

బీహార్‌ (Bihar)లోని బంకా జిల్లాలోని రాజౌన్ పోలీస్ స్టేషన్‌కు సోమవారం ఉదయం పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక వెళ్లింది.

ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 16 ఏళ్ల బాలిక.. దగ్గరకు తీసి ఏమైందని పోలీసులు అడిగితే ఆమె చెప్పింది విని..

బీహార్‌ (Bihar)లోని బంకా జిల్లాలోని రాజౌన్ పోలీస్ స్టేషన్‌కు సోమవారం ఉదయం పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక వెళ్లింది. తనకు న్యాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకుంది. షాకైన పోలీసులు అసలేం జరిగిందని ఆరా తీశారు. తన గ్రామానికే చెందిన ఓ యువకుడు తనను కిడ్నాప్ చేసి ఆరు రోజుల పాటు అత్యాచారం చేశాడని, అనంతరం అడవిలోకి తీసుకెళ్లి వదిలేశాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


ఇది కూడా చదవండి..

ఉపాధి నిమిత్తం వేరే నగరంలో భర్త.. ఇద్దరు పిల్లల గొంతులు కోసి.. ఓ భార్య బలవన్మరణం.. ఆ రాత్రి అసలేం జరిగింది..?


బంకా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాధిత బాలిక పదో తరగతి చదువుతోంది. వారం రోజుల క్రితం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆ బాలికను బలవంతంగా తన వాహనం ఎక్కించాడు. ఆ బాలిక కళ్లు, నోటికి గుడ్డ కట్టి తీసుకెళ్లాడు. వారం రోజుల పాటు ఆ బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆదివారం అర్ధరాత్రి అడవిలో వదిలి పారిపోయాడు. ఆ బాలిక ఎలాగోలా అడవి నుంచి తన ఇంటికి చేరుకుంది.


తనపై జరిగిన అత్యాచారం గురించి కుటుంబ సభ్యులకు వివరించింది. ఆ బాలిక కోసం తల్లిదండ్రులు ఆరు రోజులుగా వెతుకుతున్నారు. సోమవారం ఉదయం ఆ బాలిక నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన అత్యాచారం గురించి ఫిర్యాదు చేసింది. ఆ బాలిక ఫిర్యాదుపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Read more