102 ఏళ్ల వయసులో రికార్డు సృష్టించిన వృద్ధుడు.. కేవలం 28.07సెకన్లలోనే..
ABN , First Publish Date - 2022-03-05T22:26:01+05:30 IST
సాధారణంగా వృద్ధులు.. ఇతరుల సహాయం లేకుండా సరిగ్గా నడవలేరు. కానీ.. వయసు పరంగా ఇప్పటికే సెంచరీ కొట్టేసిన ఓ వృద్ధుడు మాత్రం లేటు వయసులో రికార్డు సృష్టించాడు. గోల్డ్ మెడల్స్ సాధించి అంద

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా వృద్ధులు.. ఇతరుల సహాయం లేకుండా సరిగ్గా నడవలేరు. కానీ.. వయసు పరంగా ఇప్పటికే సెంచరీ కొట్టేసిన ఓ వృద్ధుడు మాత్రం లేటు వయసులో రికార్డు సృష్టించాడు. గోల్డ్ మెడల్స్ సాధించి అందరినీ ఆశ్యర్యపరుస్తున్నాడు. ఇంతకూ ఆ వృద్ధుడు ఎవరు? బంగారు పతకాలు అతడిని ఎందుకు వరించాయనే పూర్తి వివరాల్లోకి వెళితే..
థాయ్‌లాండ్‌కు చెందిన సవాంగ్ జనప్రామ్కు ప్రస్తుతం 102ఏళ్లు. తాజాగా జరిగిన 26వ థాయ్‌లాండ్ మాస్టర్ అథ్లేట్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సవాంగ్ పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ పోటీల్లో అతడు రికార్డు సృష్టించాడు. 100-105ఏళ్ల వారికి సంబంధించిన కేటగిరీలో.. 100మీటర్ల పరుగు పందాన్ని కేవలం 28.07 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. కేవలం ఒక్క పరుగు పందెంలోనే కాకుండా.. ఇతర అన్ని పోటీల్లోనూ అతడే విజయం సాధించి బంగారు పతకాలను సొంతం చేసుకున్నాడు. ట్రాక్‌పై అతడు పరుగులు తీస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. సవాంగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. సవాంగ్‌కు కోచింగ్ ఇచ్చిన అతడి 70ఏళ్ల కూతురు సిరిపన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన తండ్రికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వయసు మీద పడిన కారణంగా తన తండ్రి చేతులు గతంలో అకారణంగానే వణికేవని తెలిపారు. అయితే ఆటలు, వ్యాయామాలు చేయడం ప్రారంభించిన తర్వాత అలాంటి లక్షణాలేవి తన తండ్రిలో కనిపించడం లేదన్నారు. తన తండ్రి ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తాడని.. అందుకే ఆయన మానసిక ఆరోగ్యం కూడా ఎప్పుడూ బాగుటుందని చెప్పారు.