Revanth Reddy: కవితకు సీబీఐ నోటీసులపై స్పందన.. కవితకు మాత్రం మినహాయింపు ఎందుకు?

ABN , First Publish Date - 2022-12-03T17:53:43+05:30 IST

టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha)కు సీబీఐ నోటీసులు జారీ చేసిన అంశంపై తెలంగాణ కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) స్పందించారు.

Revanth Reddy: కవితకు సీబీఐ నోటీసులపై స్పందన.. కవితకు మాత్రం మినహాయింపు ఎందుకు?
Revanthreddy

హైదరాబాద్: టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha)కు సీబీఐ నోటీసులు జారీ చేసిన అంశంపై తెలంగాణ కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) స్పందించారు. కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై తమకు అనుమానాలు ఉన్నాయని రేవంత్ అన్నారు. అందరినీ ఢిల్లీకి పిలిచి విచారణ చేస్తున్నప్పుడు కవితకు మాత్రం మినహాయింపు ఎందుకు? అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. కవితను ఇంట్లోనే విచారణ చేస్తామనడంలో ఆంతర్యమేంటి? అని రేవంత్ అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లు బెంగాల్ ఫార్ములాను అమలు చేస్తున్నాయని రేవంత్ మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-03T18:14:33+05:30 IST