అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి.. స్వదేశానికి మృతదేహాల తరలింపుకు 5రోజుల సమయం

ABN , First Publish Date - 2022-11-29T07:33:30+05:30 IST

అమెరికాలో మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి.. స్వదేశానికి మృతదేహాల తరలింపుకు 5రోజుల సమయం

అమెరికా ఎంబసీతో మంత్రులు కేటీఆర్‌, సబితారెడ్డి చర్చలు

తాండూరు/కాళోజీ జంక్షన్‌(హనుమకొండ), నవంబరు, 28 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మృతుల కుటుంబ సభ్యుల కోరిక మేరకు రెండు మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు రాష్ట్ర మంత్రులు కే.తారకరామారావు, సబితా ఇంద్రారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు అమెరికాలోని ఇండియన్‌ ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

అధికార లాంఛనాలు పూర్తి చేసి మృతదేహాలను ఇక్కడికి తేవాలంటే కనీసం 5 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మృతులు తాండూరుకు చెందిన శివదత్తా(25), హన్మకొండకు చెందిన డాక్టర్‌ కుంట ఉత్తేజ్‌ దంత వైద్య విద్య అభ్యసించిన నాటి నుంచి మంచి స్నేహితులని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరూ హైదరాబాద్‌లోని కొత్తపేటలో బీడీఎస్‌ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల (ఎంఎస్‌) కోసం అమెరికా వెళ్లారని తెలిపారు. వీరిద్దరు మరో స్నేహితుడితో కలిసి మిస్సో రి సరస్సులో సరదాగా ఈత కోసం దిగి నీటిలో ము నిగిపోయారు. శివదత్తా మృతదేహం శనివారం, మ రునాడు ఉత్తేజ్‌ మృతదేహం బయటపడ్డాయి.

Updated Date - 2022-11-29T07:33:49+05:30 IST