ఛలో దుబాయ్ అంటున్న భారతీయులు.. 9 నెలల్లోనే ఇంత భారీ సంఖ్యలో..!

ABN , First Publish Date - 2022-12-12T11:19:08+05:30 IST

గత ఏడాది తొలి అర్థభాగంలో దాదాపు 4 లక్షల మంది భారత పర్యాటకులు దుబాయ్‌ను సందర్శిస్తే.. ఆ సంఖ్య ఈ ఏడాది రెట్టింపు అయిందని దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమి అండ్ టూరిజం..

ఛలో దుబాయ్ అంటున్న భారతీయులు.. 9 నెలల్లోనే ఇంత భారీ సంఖ్యలో..!

ఎన్నారై డెస్క్: దుబాయ్ తాజాగా కీలక విషయాన్ని వెల్లడించింది. రికార్డు స్థాయిలో భారత పర్యాటకులు ఈ ఏడాది దుబాయ్‌ను సందర్శించినట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. గత ఏడాది తొలి అర్థభాగంలో దాదాపు 4 లక్షల మంది భారత పర్యాటకులు దుబాయ్‌ను సందర్శిస్తే.. ఆ సంఖ్య ఈ ఏడాది రెట్టింపు అయిందని దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమి అండ్ టూరిజం పేర్కొంది. ఈ ఏడాది తొలి అర్థభాగంలో సుమారు 8.58లక్షల మంది భారత పర్యాటకులు దుబాయ్‌ని సందర్శించినట్టు తెలిపింది. ఈ ఏడాది తొమ్మిది నెలలో దాదాపు పలు దేశాలకు చెందిన 6.8మిలియన్ల టూరిస్టులు దుబాయ్‌‌కు వచ్చినట్టు పేర్కొంది. ఇందులో భారత టూరిస్టుల సంఖ్య 1.2 మిలియన్ల‌ని స్పష్టం చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గడంతో టూరిజం తిరిగి పుంజుకుంటున్నట్టు తెలిపింది. కరోనా పూర్వ స్థితి పరిస్థితులు ఉన్నందన భారీ మొత్తంలో విదేశీ పౌరులు విదేశీ పర్యాటనకు మొగ్గు చూపుతున్నట్టు అభిప్రాయపడింది. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో మరో నలభై లక్షల మంది టూరిస్టులు దుబాయ్‌కు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా.. కరోనాకు ముుందు అంటే 2019లో మొత్తం 16.7 మిలియన్ల మంది పర్యాటకులు దుబాయ్‌ను విజిట్ చేశారట.

Updated Date - 2022-12-12T11:35:33+05:30 IST

Read more