Sharjah: భిక్షగాళ్ల నుంచి రూ.1.12కోట్లు స్వాధీనం!

ABN , First Publish Date - 2022-10-31T11:44:49+05:30 IST

భిక్షగాళ్ల నుంచి దాదాపు రూ.1.12కోట్లు స్వాధీనం చేసుకుని ఆ మొత్తాన్ని సీజ్ చేసినట్టు తాజాగా షార్జా పోలీసులు వెల్లడించారు. దీంతో ఇది స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో..

Sharjah: భిక్షగాళ్ల నుంచి రూ.1.12కోట్లు స్వాధీనం!

ఎన్నారై డెస్క్: భిక్షగాళ్ల నుంచి దాదాపు రూ.1.12కోట్లు స్వాధీనం చేసుకుని ఆ మొత్తాన్ని సీజ్ చేసినట్టు తాజాగా షార్జా పోలీసులు వెల్లడించారు. దీంతో ఇది స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

స్థానిక ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో భిక్షగాళ్లను అరెస్ట్(Beggars Arrested) చేసినట్టు షార్జా(Sharjah) పోలీసులు తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు. అధికారులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో పట్టుబడ్డ భిక్షగాళ్లతో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు అరెస్టైన భిక్షగాళ్ల సంఖ్య 1,111కు చేరిందని పేర్కొన్నారు. అరెస్టైన వారిలో 875 మంది పురుషులు.. 236 మంది మహిళలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. విజిట్ వీసాపై షార్జా వచ్చిన ప్రవాసులు కూడా అరెస్టైన వాళ్లలో ఉన్నట్టు చెప్పారు. అనారోగ్యం, మెడికల్ ట్రీట్‌మెంట్‌ను సాకుగా చెబుతూ భిక్షాటన చేస్తున్నట్టు తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 2020-21 సంవత్సరంలో 1,409 మంది భిక్షగాళ్లను అరెస్ట్ చేసినట్టు ఈ సందర్భంగా పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి 500000దిర్హమ్‌ల కంటే ఎక్కువ మొత్తాన్ని(దాదాపు 1.12కోట్లు) స్వాధీనం చేసి, సీజ్ చేసినట్టు వివరించారు.

కాగా.. UAEలో భిక్షాటన చేయడం చట్టరీత్యా నేరం. ఇక్కడ భిక్షాటన చేస్తూ ఎవరైనా పట్టుబడితే మూడు నెలల జైలు శిక్షతోపాటు 5000దిర్హమ్‌ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా భిక్షాటనను నిర్వహించిన వ్యక్తులకు తక్కువలో తక్కువ ఆరు నెలల జైలు శిక్షతోపాటు 1,00,000 దిర్హమ్‌ల ఫైన్ విధించే అవకాశం ఉంది.

Updated Date - 2022-10-31T11:50:17+05:30 IST