న్యూజిలాండ్‌లో కలకలం.. భారతీయులపై వరుస దాడులు!

ABN , First Publish Date - 2022-11-30T14:45:55+05:30 IST

న్యూజిలాండ్‌లో నివసిస్తున్న భారత్‌కు చెందిన వ్యక్తి స్టోర్‌పై కొంతమంది దుండగులు దాడికి తెగబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోజుల వ్యవధిలోనే భారతీయులపై..

న్యూజిలాండ్‌లో కలకలం.. భారతీయులపై వరుస దాడులు!

ఎన్నారై డెస్క్: న్యూజిలాండ్‌లో నివసిస్తున్న భారత్‌కు చెందిన వ్యక్తి స్టోర్‌పై కొంతమంది దుండగులు దాడికి తెగబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోజుల వ్యవధిలోనే భారతీయులపై వరుస దాడులు చోటు చేసుకోవడం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇండియాకు చెందిన సిధూ నరేష్(Sidhu Naresh) అనే వ్యక్తి న్యూజిలాండ్‌(New Zealand)లో స్థిరపడ్డాడు. న్యూజిలాండ్‌లోని హామిల్టన్‌లో ఓ స్టోర్‌ను సొంతంగా నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొంత మంది దుండగులు శుక్రవారం నాడు అతడి స్టోర్‌లోకి చొరబడ్డారు. అతడి పీకపై కత్తి పెట్టి బెదిరించారు. అంతేకాకుండా.. స్టోర్‌లోని వస్తువులను ధ్వంసం చేశారు. లాకర్‌లోని డబ్బులను ఎత్తుకెళ్తుండగా.. అడ్డుపడిన మరో వ్యక్తిపై కూడా దుండగులు దాడి చేసినట్టు స్థానిక మీడియా తెలిపింది. దుండగుల వయసు 16ఏళ్లలోపే ఉంటుందని మీడియా వెల్లడించింది. కాగా.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితమే భారత్‌కు చెందిన 34ఏళ్ల జానక్ పటేల్ అనే వ్యక్తిపై.. ఆక్లాండ్‌లోని అతడు పని చేసే ప్రదేశంలోనే దాడి చేసి హత్య చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Updated Date - 2022-11-30T14:45:55+05:30 IST

Read more