Kuwait: ఎయిర్‌పోర్టు నుంచి మిత్రుడిని పికప్ చేసుకోవడానికి వెళ్లిన ప్రవాసుడికి ఊహించని షాక్.. ఏకంగా దేశ బహిష్కరణ..

ABN , First Publish Date - 2022-10-22T20:00:37+05:30 IST

విమానాశ్రయం నుంచి తన స్నేహితుడిని పికప్ చేసుకోవడానికి వెళ్లిన ప్రవాసుడికి ఊహించని షాక్ తగిలింది. ఏకంగా దేశ బహిష్కరణ వరకు వెళ్లింది.

Kuwait: ఎయిర్‌పోర్టు నుంచి మిత్రుడిని పికప్ చేసుకోవడానికి వెళ్లిన ప్రవాసుడికి ఊహించని షాక్.. ఏకంగా దేశ బహిష్కరణ..
మిత్రుడి కోసం ఎయిర్‌పోర్టుకు వెళ్లిన ప్రవాసీయుడికి భారీ షాక్

కువైత్ సిటీ: విమానాశ్రయం (Airport) నుంచి తన స్నేహితుడిని పికప్ చేసుకోవడానికి వెళ్లిన ప్రవాసుడికి ఊహించని షాక్ తగిలింది. ఏకంగా దేశ బహిష్కరణ (Deportation) వరకు వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా తన స్నేహితుడిని పికప్ చేసిన ఈజిప్టు ప్రవాసీయుడిని (Egyptian expatriate) దేశం నుంచి బహిష్కరించాలని రిఫర్ చేసినట్లు కువైత్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వెల్లడించింది. సదరు ప్రవాసుడు తన మిత్రుడిని ఎయిర్ పోర్టు నుంచి పికప్ చేసుకుని రోడ్డుపై ప్రమాదకరంగా ట్రావెల్ బ్యాగులతో డ్రైవింగ్ (Driving) చేశాడని డైరెక్టరేట్ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో (Social media) వైరల్‌గా మారింది. దాంతో ఆ వీడియోపై విచారణకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఆదేశించింది.

వీడియోలోని దృశ్యాల ఆధారంగా ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసిన వ్యక్తిని గుర్తించి అతడి బైకును సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. విచారణ సమయంలో నిందితుడు తన స్నేహితుడిని విమానాశ్రయం నుంచి పికప్ చేసుకోవడానికి మాత్రమే వెళ్లానని, ట్రావెల్ బ్యాగులను తన మిత్రుడే అలా పట్టుకున్నట్లు తెలిపినట్లు డైరెక్టరేట్ తన నివేదికలో పేర్కొంది. ఏదేమైనా ప్రవాసుడు (Expat) చేసింది అక్కడి ట్రాఫిక్ నిబంధనల ప్రకారం నేరమని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు వెల్లడించారు. విచారణ అనంతరం ఈజిప్టియన్‌ను దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుందని తెలిపారు.

Updated Date - 2022-10-22T20:00:43+05:30 IST