Big Ticket: రూ.66.50కోట్లు గెలుచుకున్న భారత వ్యక్తి ఆచూకీ తెలిసింది.. ఇంతకీ అతనెవరో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-12-07T09:07:34+05:30 IST

అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్‌లో (Abu Dhabi Big Ticket Raffle) భారత్‌కు చెందిన కథార్ హుస్సేన్ (Kathar Hussain) ఏకంగా 30 మిలియన్ దిర్హమ్స్ (రూ. 66.50కోట్లు) గెలుచుకున్న విషయం తెలిసిందే.

Big Ticket: రూ.66.50కోట్లు గెలుచుకున్న భారత వ్యక్తి ఆచూకీ తెలిసింది.. ఇంతకీ అతనెవరో తెలిస్తే..

అబుదాబి: అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్‌లో (Abu Dhabi Big Ticket Raffle) భారత్‌కు చెందిన కథార్ హుస్సేన్ (Kathar Hussain) ఏకంగా 30 మిలియన్ దిర్హమ్స్ (రూ. 66.50కోట్లు) గెలుచుకున్న విషయం తెలిసిందే. గత శనివారం (ఈ నెల 3వ తేదీన) సాయంత్రం అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో (Abu Dhabi International Airport) తీసిన రాఫెల్ డ్రాలో షార్జాలో (Sharjah) ఉండే కథార్‌కు ఈ జాక్‌పాట్ తగిలింది. తీరా లాటరీ నిర్వాహకులు కాల్ చేసి అతనికి ఈ విషయం చెబుదామనుకుంటే ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. ఆ సమయంలో కథార్ యూఏఈలో విహారయాత్రలో ఉన్నాడట. కానీ డ్రాను లైవ్‌లో చూశాడు. దాంతో తాను భారీ ప్రైజ్‌మనీ గెలుచుకున్న విషయం తెలిసింది.

అంతే.. ఏమాత్రం ఆలస్యం చేకుండా టికెట్ బుక్ చేసుకుని రిటర్న్ ఫ్లైట్‌ ఎక్కేశాడు. షార్జా వచ్చిన తర్వాత నిర్వాహకులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఇంతకీ కథార్ హుస్సేన్ ఎవరు? షార్జాలో అతడు ఏ పని చేస్తున్నాడు? అసలు లాటరీ టికెట్ ఎలా కొనుగోలు చేశాడు? తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. షార్జాలో ఉండే భారత ప్రవాసుడు కథార్ హుస్సేన్‌ది (Kathar Hussain) తమిళనాడు రాష్ట్రం. 27ఏళ్ల కథార్ షార్జాలోని ఓ కార్ వాష్ కంపెనీలో పని చేస్తున్నాడు. దానికి గాను అతనికి నెలకు 1500 దిర్హమ్స్ (రూ.33,677) శాలరీ వస్తుంది. అలాగే కస్టమర్లు టిప్స్ ఇస్తుంటారు. వాటితోనే కథార్ నవంబర్ 6వ తేదీన 246 సిరీస్‌లో 206975 నంబర్ గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ సర్వీస్‌ ద్వారా కొన్నాడు. ఇంకో విషయం ఏంటంటే 2 టికెట్లు కొంటే.. ఒక టికెట్ ఫ్రీ అనే ఆఫర్ (2+1 free offer) సందర్భంగా కథార్ ఈ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.

అయితే, ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే.. అతడు కొన్న రెండు టికెట్లకు లాటరీ తగలలేదు. కానీ, ఫ్రీగా వచ్చిన మూడో టికెట్ ఉంది చూడండి.. అదే కథార్‌కి లక్‌ను తెచ్చిపెట్టింది. కథార్‌కి ఫ్రీగా వచ్చిన టికెట్‌కే (నం.206975) ఈ జాక్‌పాట్ తగిలింది. దాంతో రూ.66.50కోట్లు గెలిచాడు. ఇక డ్రాలో విజేతగా నిలిచిన అతనికి షో హోస్ట్ రిచర్డ్ ఫోన్ చేశారు. కానీ, ఆ సమయంలో అతడి ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. అదే టైంలో కథార్ యూఏఈలో విహారయాత్రలో ఉన్నాడట. కానీ ఆరోజు డ్రాను లైవ్‌లో చూశాడు. దాంతో తాను భారీ ప్రైజ్‌మనీ గెలుచుకున్న విషయం తెలిసింది. అంతే.. ఏమాత్రం ఆలస్యం చేకుండా టికెట్ బుక్ చేసుకుని రిటర్న్ ఫ్లైట్‌ ఎక్కేశాడు. షార్జా వచ్చిన తర్వాత నిర్వాహకులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఇక ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం కథార్ ఆనందం వ్యక్తం చేశాడు. తన పుట్టినరోజు అయిన నవంబర్ 11వ తేదీకి కొన్ని రోజుల ముందు (నవంబర్ 6న) తాను కొన్న లాటరీ టికెట్‌కు భారీ ప్రైజ్‌మనీ దక్కడం నిజంగా చాలా బాగుందన్నాడు. ఈ ఏడాది బర్త్‌డేను తన జీవితంలో మరిచిపోలేనని అన్నాడు.

Updated Date - 2022-12-07T10:53:15+05:30 IST