వామ్మో.. వీల్‌ చైర్ చక్రాలను ఇలా కూడా ఉపయోగిస్తారా? మహిళ చేసిన పనికి అధికారులు షాక్!

ABN , First Publish Date - 2022-11-17T19:20:35+05:30 IST

నడవలేని వాళ్లు ఉపయోగించే చక్రాల కుర్చీని ఓ మహిళ మరో పని కోసం వాడింది. ఈ క్రమంలోనే అధికారుల ముందు అడ్డంగా బుక్కైపోయింది. సదరు మహిళ చక్రాల కుర్చీని దేని కోసం ఉపయోగించిందో గుర్తించి అధికారులు కంగుతిన్నారు. అనంతరం

వామ్మో.. వీల్‌ చైర్ చక్రాలను ఇలా కూడా ఉపయోగిస్తారా? మహిళ చేసిన పనికి అధికారులు షాక్!

ఎన్నారై డెస్క్: నడవలేని వాళ్లు ఉపయోగించే చక్రాల కుర్చీని ఓ మహిళ మరో పని కోసం వాడింది. ఈ క్రమంలోనే అధికారుల ముందు అడ్డంగా బుక్కైపోయింది. సదరు మహిళ చక్రాల కుర్చీని దేని కోసం ఉపయోగించిందో గుర్తించి అధికారులు కంగుతిన్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తాజాగా ఆ మహిళ కేసుకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. దీంతో ఆమె వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎమెలిండా పౌలినో డి రివాస్ అనే మహిళ కొద్ది రోజుల క్రితం డొమినికన్ రిపబ్లిక్ నుంచి విమానంలో న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్.కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. నడవలేని స్థితిలో ఉన్నట్టుగా చక్రాల కుర్చీలో ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆమెను చూసి.. అక్కడి సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. పైగా చక్రాల కుర్చీకి ఉన్న చక్రాలు తిరగకపోయే సరికి.. వారి అనుమానం మరింత బలబడింది. కుర్చీని స్కాన్ చేసి చూశారు. కుర్చీ చక్రాల్లో అనుమానస్పద పదార్థాలు కనిపిండంతో.. వాటిని నిశితంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే చక్రాల్లో కొకైన్‌ను గుర్తించిన అధికారులు.. ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం కుర్చీకి ఉన్న నాలుగు చక్రాల్లోంచి.. 28పౌండ్ల(దాదాపు 12.7కిలోలు) కొకైన్‌ను బయటకు తీసిన అధికారులు.. ఎమెలిండాను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించిన అధికారులు.. తాము స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ దాదాపు రూ.3.66కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణ గురించి.. సదరు మహిళను విచారిస్తున్నట్టు తెలిపారు. కాగా.. వీల్ చైర్ చక్రాల ద్వారా స్మగ్లింగ్ చేస్తూ మహిళ పట్టుబడ్డ ఘటన ప్రస్తుతం అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది

Updated Date - 2022-11-17T19:51:33+05:30 IST

Read more