రూ.1.13కోట్ల జీతంతో ఉద్యోగం.. వైరల్ అవుతున్న ఉద్యోగ ప్రకటన.. ఇంతకూ ఎంపికైన అభ్యర్థి ఏం చేయాలంటే..

ABN , First Publish Date - 2022-12-03T11:34:11+05:30 IST

కోట్లాది రూపాయల జీతంతో కూడిన ఓ ఉద్యోగ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చాలా మంది నిరుద్యోగులను ఆ ఉద్యోగ ప్రకటన ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ ప్రకటన నెట్టింట హాట్ టాపిక్‌గా..

రూ.1.13కోట్ల జీతంతో ఉద్యోగం.. వైరల్ అవుతున్న ఉద్యోగ ప్రకటన.. ఇంతకూ ఎంపికైన అభ్యర్థి ఏం చేయాలంటే..

ఇంటర్నెట్ డెస్క్: కోట్లాది రూపాయల జీతంతో కూడిన ఓ ఉద్యోగ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చాలా మంది నిరుద్యోగులను ఆ ఉద్యోగ ప్రకటన ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ ప్రకటన నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఇంతకూ ఆ ఉద్యోగ ప్రకటన ఎవరిచ్చారు? ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి చేయాల్సిన పని ఏంటి? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ సిటీ గురించి బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ సిటీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఈ ఉద్యోగ ప్రకటన అక్కడి నుంచే వచ్చింది. న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్.. ఈ ఉద్యోగ ప్రకటన చేశారు. నగర ప్రజలను ఎలుకలు తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయట. ఈ క్రమంలోనే ఫిర్యాదులు వెల్లువెత్తాయట. దీంతో స్పందించిన ఎరిక్ ఆడమ్స్.. ప్రజలను ఎలుకల బాధ నుంచి విముక్తి కల్పించేందుకు ఈ ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు.

ఎలుకలను పట్టుకునే సామర్థ్యం, సత్తువ ఉన్న అభ్యర్థులు డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు ఎలుకలను అంతం చేసేందుకు తగిన హ్యూహాలను రచించి.. అమలు పరచాల్సి ఉంటుందట. విధులను సక్రమంగా నిర్వహిస్తే.. 170,000 డాలర్లు అంటే దాదాపు రూ.1.13కోట్లును జీతంగా చెల్లిస్తారట. ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాలని ప్రకటనలో వెల్లడించారు.

Updated Date - 2022-12-03T12:26:07+05:30 IST