Viral: విమానంలో గర్ల్‌ఫ్రెండ్ ముందు పెళ్లి ప్రపోజల్..

ABN , First Publish Date - 2022-10-23T21:20:35+05:30 IST

విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral: విమానంలో గర్ల్‌ఫ్రెండ్ ముందు పెళ్లి ప్రపోజల్..

ఎన్నారై డెస్క్: విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూనైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రయన్, స్టెఫానీ ఎంతో కాలంగా డేటింగ్ చేస్తున్నారు. అయితే.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించిన అతను.. వినూత్న రీతిలో ఆమె ముందు తన మనసులో మాటను బయటపెట్టాలనుకున్నాడు. తాము విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో.. తనను పెళ్లి చేసుకోమని ఆమెను కోరాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయాన్ని ఎయిర్‌లైన్స్‌కు చెప్పడంతో వారూ అంగీకరించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశారు. స్టెఫానీని సర్‌ప్రైజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆమెకు తెలీకుండానే ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఆ తరువాత... తన ప్లాన్‌ను బ్రయన్ అమలు చేయడంతో స్టెఫానీ ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయిపోయింది. ‘‘నిన్నే పెళ్లాడతా’’ అంటూ బ్రయన్‌కు మురిసిపోతూ చెప్పింది. ఇక బ్రయన్ ప్రపోజ్ చేస్తుండగా తీసిన ఫొటోలను యూనైటెడ్ ఎయిర్‌లైన్స్.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. నెటిజన్లను తెగ మురిపిస్తోంది. ఈ విషయంలో బ్రయన్‌కు సహకరించినందుకు ఎయిర్‌లైన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2022-10-23T21:20:35+05:30 IST
Read more