వేగంగా ప్రయాణిస్తున్న ట్రక్కుపై చిందులు.. చివరికి ఆ 25ఏళ్ల యువకుడికి ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-11-18T17:45:47+05:30 IST

సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. తాజాగా ఓ 25ఏళ్ల యువకుడు కూడా అలాగే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో

వేగంగా ప్రయాణిస్తున్న ట్రక్కుపై చిందులు.. చివరికి ఆ 25ఏళ్ల యువకుడికి ఏం జరిగిందంటే..

ఎన్నారై డెస్క్: సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. తాజాగా ఓ 25ఏళ్ల యువకుడు కూడా అలాగే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రస్తుతం అతడికి సంబంధించిన వార్త, ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

టెక్సాస్‌కు చెందిన 25ఏళ్ల యువకుడు.. వైరల్ వీడియో కోసం స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. హ్యూస్టన్‌లోని Eastex Freewayపై ప్రయాణం చేస్తూనే.. పక్కనే ఉన్న భారీ ట్రక్కుపైకి ఎక్కేశాడు. అనంతరం ఆ ట్రక్కుపై చిందులేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఆ ట్రక్కు ఓ ఓవర్‌పాస్ కింద నుంచి వెళ్లడంతో.. అతడు చాకచక్యంగా దాని నుంచి తప్పించుకున్నాడు. ఆ వెంటనే మరో ఓవర్‌పాస్ ఉన్న విషయాన్ని అతడు గుర్తించలేదు. ఈ నేపథ్యంలో ఓవర్‌పాస్ బ్రిడ్జి అతడికి బలంగా తగిలింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆ 25ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దృశ్యాలను ట్రక్కు వెనకాలే ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది.

Updated Date - 2022-11-18T17:52:14+05:30 IST

Read more