Indian Students: యూకేలో ఏటా రెండు వేల మందికి అడ్మిషన్లు

ABN , First Publish Date - 2022-11-27T12:19:49+05:30 IST

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లోని వివిధ యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థులు ఏటా రెండు వేల మంది ప్రవేశాలు పొందుతున్నారని ఈస్ట్‌ లండన్‌ ఇంటర్నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ డైరెక్టర్‌ డేనియల్‌ కఫీ చెప్పారు.

Indian Students: యూకేలో ఏటా రెండు వేల మందికి అడ్మిషన్లు

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లోని వివిధ యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థులు ఏటా రెండు వేల మంది ప్రవేశాలు పొందుతున్నారని ఈస్ట్‌ లండన్‌ ఇంటర్నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ డైరెక్టర్‌ డేనియల్‌ కఫీ చెప్పారు. వీరు సెప్టెంబర్‌, జనవరి, మే నెలలో జరిగే మూడు ఇన్‌టేక్‌లల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఐవీవై ఓవర్సీస్‌ ఆధ్వర్యంలో ‘యూకేలో విద్యావకాశాలు’ అంశంపై బంజారాహిల్స్‌లో శనివారం బీటెక్‌ విద్యార్థులకు సెమినార్‌ నిర్వహించారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ లండన్‌లో అందుబాటులో ఉన్న విద్యావకాశాలపై విద్యా నిపుణులు, వక్తలు చర్చించారు. డెనియల్‌ కఫీ మాట్లాడుతూ యూకే యూనివర్సిటీల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు వారానికి 20 గంటలు పనిచేసుకునే అవకాశముంటుందన్నారు. సెమినార్‌లో ఈస్ట్‌ లండన్‌ యూనివర్సిటీల ప్రతినిధులు డాక్టర్‌ డేవిడ్‌ టాన్‌, రోబోర్ట్‌ వాటర్సన్‌, వానెస్సా వర్వాస్‌, ఓయూ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవీందర్‌, ఒమెగా విమెన్స్‌ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ లక్ష్మీకారుణ్య, ఐవీవై ఓవర్సీస్‌ ఎండీ బీఎ్‌సజీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T12:19:51+05:30 IST