మూడు రంగుల పువ్వు
ABN , First Publish Date - 2022-04-04T06:53:12+05:30 IST
ముందుగా క్రాఫ్ట్పేపర్లు తీసుకుని అర అంగుళం సైజు వెడల్పుతో ఉండేలా ఆరు స్ట్రిప్స్ కత్తిరించుకోవాలి. అలా నాలుగు రంగుల పేపర్లను కత్తిరించుకోవాలి.

కావలసినవి
తెలుపు, ఆకుపచ్చ, ఆరెంజ్, నీలంరంగు క్రాఫ్ట్ పేపర్లు, కత్తెర, జిగురు, స్టేప్లర్.
ఇలా చేయాలి...
ముందుగా క్రాఫ్ట్పేపర్లు తీసుకుని అర అంగుళం సైజు వెడల్పుతో ఉండేలా ఆరు స్ట్రిప్స్ కత్తిరించుకోవాలి. అలా నాలుగు రంగుల పేపర్లను కత్తిరించుకోవాలి.
తరువాత వాటిని బొమ్మలో చూపిన విధంగా ఆరెంజ్, తెలుపు, ఆకుపచ్చ వరుస క్రమంలో పెట్టాలి. ఇప్పుడు వాటి మధ్యలో స్టేప్లర్‌తో పిన్ కొట్టాలి.
ఒక్కోస్ట్రిప్ను పిన్ కొట్టిన ప్రదేశానికి వంచుతూ జిగురుతో అతికించాలి. అలా అన్ని స్ట్రిప్స్‌ను బెండ్ చేస్తూ అంటించాలి.
బొమ్మలో చూపించిన విధంగా మధ్యలో నీలరంగు పేపర్‌ను గుండ్రంగా కత్తిరించి అతికించాలి. అంతే... మూడు రంగుల పువ్వు రెడీ.