5 healthy habits: పిల్లల observationను బలపరిచే 5 ఆరోగ్యకరమైన అలవాట్లు ఇవే..!
ABN , First Publish Date - 2022-10-17T20:37:03+05:30 IST
పిల్లాడు అస్తమానూ పరధ్యానంలో పడిపోతున్నాడని... ఏదో ఆలోచిస్తూ ఉంటున్నాడని విసుక్కుంటూ ఉంటారు చాలామంది తల్లులు.
పిల్లాడు అస్తమానూ పరధ్యానంలో పడిపోతున్నాడని... ఏదో ఆలోచిస్తూ ఉంటున్నాడని విసుక్కుంటూ ఉంటారు చాలామంది తల్లులు. పుట్టాకా ప్రపంచంలోకి అడుగు పెట్టాకా ప్రతి చర్యనూ గమనిస్తూ ఎదుగుతారు పిల్లలు. చాలా నేర్చుకుంటూ ఉంటారు. గమనింపు లేనిదే ఏ విషయమూ తెలీదు. చిన్న వయస్సు పిల్లలు ఇతరులను గమనించడం ద్వారా నేర్చుకుంటారు. అలా నేర్చుకున్న విషయాలు వాళ్ళ మనస్సుపై శాశ్వత ముద్ర వేస్తాయి. పిల్లలు వీటిని ఎక్కువకాలం మెదడులో నిలుపుకుంటారు.
పిల్లలలో పరిశీలనా నైపుణ్యాలు..
1. ప్రశ్నలను ప్రోత్సహించండి.
పిల్లలు చాలా ప్రశ్నలు అడిగుతారు.., ఉత్సాహంతో కూడినవి, పరిశీలనతో తెలుసుకున్నవి.. చిన్ని చిన్ని అనుభవాలు ఇలా అన్నీ తల్లిదండ్రులతో కలిపి ఆలోచిస్తారు. వాళ్ళనే తిరిగి అడిగి తెలుసుకుంటారు. చిన్న వయసులోనే అన్ని విషయాలూ తెలుసుకోవాలనే జిజ్ఞాస పిల్లలకు ఉండటం సహజం.
2. నాయకత్వం వహించనివ్వండి.
పిల్లల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి చిన్న చిన్న పనులను అప్పగించండి. వారి సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేలా గమనించడానికి పిల్లలకి అవకాశం ఇవ్వండి.
3. మాట్లాడుతూ పిల్లలతో పాలుపంచుకోవాలి..
పిల్లలు చాలా వివరాలు తెలుసుకోవడానికి శ్రద్ధ చూపుతారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కమ్యూనికేట్ చేసి, విషయాలను వాళ్ళతో పంచుకోవాలి. ఇంట్లో చిన్న చిన్న విషయాలకు వాళ్ల సలహాలను అడుగుతూ ఉండాలి. అంతేకాదు పార్క్లో సరదాగా గడిపిన రోజు గురించి పిల్లలతో సరదాగా మాట్లాడుతూ ఉండాలి. కొత్త అనుభవాలను, వాళ్ళు చూసినవి, అనుభూతి చెందినవి, వాసన చూసినవి, విన్నవి, రుచి చూసినవి ఇలా ప్రతి విషయాన్నీ గమనించి గుర్తు చేసుకునేలా చేయాల్సింది తల్లిదండ్రులే.
4. కథల పుస్తకాలు, రైమ్స్క్ చదవండి.
పిల్లల మెదడుకు తగిన ప్రేరణ చాలా అవసరం. కథలు చదవడం, ఇవి వారి దృష్టిని ఆకర్షిస్తాయి. అదే సమయంలో కథలను చిన్న చిన్న బొమ్మలతో ఉండే పుస్తకాలను పరిచయం చేయండి ఆ చిత్రాలలోని పాత్రలను గుర్తించమని పిల్లల్ని అడగండి.
5. పరిశీలన, ఏకాగ్రత అవసరమయ్యే ఆటలను ఆడండి.
తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పిల్లలకు తేడాలను గుర్తించడం, మెమరీ ఆధారంగా డ్రాయింగ్, చదరంగం, రకరకాల పజిల్స్, మెమరీ గేమ్ వంటి ఆటల వైపు ప్రోత్సహించాలి.