ఏడేళ్ల చిన్నారి ఈతలో రికార్డు!
ABN , First Publish Date - 2022-01-13T05:30:00+05:30 IST
పిల్లల్లో ఆసక్తిని, ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఇందుకు మంచి ఉదాహరణ ఈ ఏడేళ్ల చిన్నారి. కేరళలోని అలప్పుజకు చెందిన ఏడేళ్ల జువెల్ మరియం బాసిల్ స్విమ్మింగ్‌లో...
పిల్లల్లో ఆసక్తిని, ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఇందుకు మంచి ఉదాహరణ ఈ ఏడేళ్ల చిన్నారి. కేరళలోని అలప్పుజకు చెందిన ఏడేళ్ల జువెల్ మరియం బాసిల్ స్విమ్మింగ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి అందరి మన్ననలు అందుకుంది.
చెర్తాలలోని తవనకడవు నుంచి ఉదయం 8 గంటలకు స్విమ్మింగ్‌ను ప్రారంభించింది జువెల్. రెండు పడవలు, కోస్ట్‌గార్డ్ అధికారులు అనుసరిస్తుండగా 1 గంట 53 నిమిషాల పాటు ఏకధాటిగా ఈది వైకోమ్‌లోని కోలోతుంకడువు మార్కెట్‌కు చేరుకుని రికార్డు సృష్టించింది. ఆ చిన్నారి గమ్యాన్ని చేరుకుగానే స్థానికులు చప్పట్లతో అభినందనలు తెలిపారు.
జువెల్ మూడేళ్ల వయసులోనే ఈతపై ఆసక్తి పెంచుకుంది. సోదరునితో కలిసి రోజూ స్విమ్మింగ్ ప్రాక్టీస్‌కు వెళ్లేది. జువెల్లో ఉన్న ప్రతిభను కోచ్ బిజు గమనించి ప్రత్యేక శ్రద్ధతో శిక్షణనిచ్చాడు. దాని ఫలితమే ఇప్పుడు అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది.
స్థానిక విద్యా వికాస్ స్కూల్లో జువెల్ రెండో తరగతి చదువుతోంది. సరైన శిక్షణతో భవిష్యత్తులో స్విమ్మింగ్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుందని కోచ్ బిజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జువెల్ నెలకొల్పిన రికార్డును గిన్నిస్ వరల్డ్ రికార్డు అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.