మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-11-22T22:20:34+05:30 IST

పసుపు పచ్చ రంగులో ఉండే ఈ చిన్న పిట్ట పేరు ‘కెనరీ’. స్పెయిన్‌లోని కెనరీ ద్వీపాల్లో ఇవి పుట్టాయి కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది. ఇవి పిచ్చుకల్లా ఉంటాయి.

మీకు తెలుసా?

పసుపు పచ్చ రంగులో ఉండే ఈ చిన్న పిట్ట పేరు ‘కెనరీ’. స్పెయిన్‌లోని కెనరీ ద్వీపాల్లో ఇవి పుట్టాయి కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది. ఇవి పిచ్చుకల్లా ఉంటాయి.

ఇవి ఆఫ్రికాతో పాటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో అధికంగా ఉంటాయి.

ఇవి అడవులు, పార్కులు, పల్లెలు, అర్బన్‌ హోమ్స్‌లో కూడా జీవిస్తాయి.

దీని స్వరం అద్భుతం. పక్షుల్లో ఉండే గ్రేట్‌ సింగర్స్‌ ఇవి. అది కూడా మగ పక్షి మాత్రమే ఆడపక్షిని ఆకర్షించడానికి కూస్తుంది. ఆడపక్షితో స్నేహం కుదిరాక ఇక పాట పాడటం మానేస్తుంది.

పాము కుబుసం విడిచినట్లు.. ఇవి సంవత్సరానికోసారి వీటి రెక్కలను వదుల్చుకుంటాయి. మళ్లీ పసుప్పచ్చ రంగులో కొత్త రంగుతో అందంగా కనిపిస్తాయి.

పసుపుతో పాటు ఎరుపు-ఆరెంజ్‌, తెలుపు, గోధుమరంగు, పింక్‌ రంగుల్లో కూడా ఉంటాయి.

ఇవి తెలివైన పక్షులు. మనుషుల చేతిమీద కూడా ఆడుకుంటాయి. మెల్లగా వేళ్లతో తాకటాన్ని ఇష్టపడతాయి. ఇవి పంజరాల్లో ఉంచకున్నా ఎక్కడికీ పోవు. అయితే పిల్లుల బారిన పడి చనిపోతుంటాయి.

ఫ విత్తనాలు, పురుగులు తిని జీవిస్తాయి. వీటి జీవితకాలం పదిహేను సంవత్సరాలు.

Updated Date - 2022-11-22T22:20:35+05:30 IST