లీఫ్ అక్వేరియం
ABN , First Publish Date - 2022-05-17T05:30:00+05:30 IST
నాలుగు రకాల ఆకులను తీసుకుని కత్తెర సహాయంతో చేపల ఆకారాలు బొమ్మలో చూపిన విధంగా కట్ చేయాలి.
కావలసినవి
రకరకాల సైజుల్లో ఉన్న ఐదు ఆకులు, రంగురంగుల స్టోన్స్, బ్లూ ఆర్ట్ షీట్, పెయింట్స్, పెయింట్ బ్రష్, కత్తెర, జిగురు, గూగ్లీ కళ్లు, ఫోమ్ ఫిష్, మార్కర్.
ఇలా చేయాలి...
నాలుగు రకాల ఆకులను తీసుకుని కత్తెర సహాయంతో చేపల ఆకారాలు బొమ్మలో చూపిన విధంగా కట్ చేయాలి.
తరువాత ఆ ఆకులకు రకరకాల రంగులు వేయాలి. ఎలాంటి డిజైన్స్ వేస్తారో మీ ఇష్టం.
ఇప్పుడు గూగ్లీ కళ్లు అతికించాలి.
బ్లూ ఆర్ట్ షీట్‌పై రంగురంగుల రాళ్లను అతికించాలి. ఫోమ్ ఫిష్‌ను అంటించాలి.
మార్కర్ సహాయంతో బబుల్స్ గీయాలి. అంతే.... లీఫ్ అక్వేరియం రెడీ.