New Year : పలు దేశాల్లో... ‘న్యూ’ ఇయర్‌!

ABN , First Publish Date - 2022-12-31T23:05:33+05:30 IST

వాస్తవానికి న్యూ ఇయర్‌ అనే కాన్సెప్ట్‌ రోమ్‌లో తొలిసారిగా ప్రారంభమైంది. ఇక అమెరికాలో న్యూ ఇయర్‌ను స్వాగతించే బాల్‌ డ్రాప్‌ కల్చర్‌ 1904 నుంచీ ఉంది. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా

New Year : పలు దేశాల్లో... ‘న్యూ’ ఇయర్‌!

  • వాస్తవానికి న్యూ ఇయర్‌ అనే కాన్సెప్ట్‌ రోమ్‌లో తొలిసారిగా ప్రారంభమైంది. ఇక అమెరికాలో న్యూ ఇయర్‌ను స్వాగతించే బాల్‌ డ్రాప్‌ కల్చర్‌ 1904 నుంచీ ఉంది. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా టైమ్‌ స్క్వేయర్‌లో జరుగుతుంది. తొలిసారి న్యూ ఇయర్‌ వేడుకలకు 2 లక్షల మంది హాజరయ్యారు. ఆ న్యూ ఇయర్‌ వేడుకలు పత్రికలో రావటం అదే ప్రథమం. ప్రతి ఏడాది కనీసం 50 టన్నుల చెత్త పోగవుతుందక్కడ.

  • బ్రెజిల్‌లో న్యూఇయర్‌ రోజును సముద్రతీరాల వద్ద గడుపుతారు. ఇదో ఆనవాయితీ.

  • డెన్మార్క్‌లో పింగాణీ ప్లేట్లను తమ బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద విసిరేస్తారు. దీని వల్ల అదృష్టం వరిస్తుందని నమ్ముతారు.

  • న్యూ ఇయర్‌ రిజల్యూషన్స్‌ను జనవరి 1 తేదిన 80 శాతం ప్రజలు ప్రకటిస్తారు. దాదాపు అందరూ ఫిబ్రవరిలో ఆ విషయమే మర్చిపోతారు.

  • గ్రెగేరియన్‌ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టి జనవరి 1 వతేదీ ప్రాముఖ్యం చెప్పిన పోప్‌ జార్జి గీఐఐఐ కు మనం థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. ఈ సంప్రదాయం మనకు 350 ఏళ్ల కితం ప్రారంభమైంది. అయితే టర్కీలో మాత్రం 1927 నుంచి ఈ క్యాలెండర్‌ అమల్లోకి వచ్చింది.

  • లాటిన్‌ భాష ప్రకారం జనవరి అంటే ‘న్యూ డోర్‌’ అనే అర్థం వస్తుంది.

  • న్యూఇయర్‌ రోజున కొత్త ఎర్రచెడ్డీ ధరిస్తే అదృష్టం కలిసొస్తుందని కొందరి ఇటాలియన్ల నమ్మకం.

  • బొలీవియాలో నాణేలు వేసి స్వీట్స్‌ తయారు చేస్తారు. జనవరి రోజున ఎవరికి కాయిన్స్‌ దొరికితే వాళ్లు అదృష్టవంతులుగా భావిస్తారు. ఫ్రెంచి వాళ్లు స్టాక్‌ పెట్టుకున్న ప్యాన్‌కేక్స్‌ తింటారు.

  • చైనీయులు మాత్రం వారి కొత్త సంవత్సరాన్ని క్యాలెండర్‌ ప్రకారం జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో జరుపుతారు.

Updated Date - 2022-12-31T23:05:37+05:30 IST