How to handle your grumpy toddler: పిల్లల కోపాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి..తల్లిదండ్రులకు చిట్కాలు..?

ABN , First Publish Date - 2022-10-18T17:12:32+05:30 IST

పిల్లలు కోరుకున్నది వాళ్ళకు తెచ్చివ్వాలని చూస్తారు. ఇంత చేసినా కొన్ని సందర్భాలలో పిల్లలు కోపం రూపంలోనే వాళ్ళ అసంతృప్తిని ప్రదర్శిస్తూ ఉంటారు.

How to handle your grumpy toddler: పిల్లల కోపాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి..తల్లిదండ్రులకు చిట్కాలు..?

పిల్లలకు అట్టే కోపం వచ్చేస్తూ ఉందా.. చిన్నదానికే అలుగుతున్నారా? అయితే ఈ కోపాన్ని కంట్రోల్ చేయాల్సింది తల్లిదండ్రులే. వాళ్ళే పిల్లల మానసిక సమస్యను సున్నితంగా హ్యాండిల్ చేయగలరు, అదేలాగంటే..!


పిల్లల సరైన పెంపకం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. బిడ్డకు అన్ని విధాలా మంచి జరగాలనే తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే పిల్లలు కోరుకున్నది వాళ్ళకు తెచ్చివ్వాలని చూస్తారు. ఇంత చేసినా కొన్ని సందర్భాలలో పిల్లలు కోపం రూపంలోనే వాళ్ళ అసంతృప్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లల కోపాన్ని ప్రశాంతంగా హ్యాండిల్ చేయడానికి ఇవిగో ఈ చిట్కాలను ఫాలో అయిపోండి. 


1. కోపం ఏ స్థాయిలో ఉందో గమనించండి.

అతి ముఖ్యమైన విషయం పిల్లల కోపం ఏ స్థాయిలో ఉందో ముందుగా తెలుసుకోవాల్సింది తల్లిదండ్రులే. పిల్లలు ఏదైనా విషయంగా కోపంగా ఉన్నప్పుడు తనకి ఎంత కోపంగా ఉందో చెప్పమని అడగండి. ఇలా చేయడం వల్ల పిల్లల కోపాన్ని అంచనా వేసే వీలు కలుగుతుంది. దానికి తగినట్టు వాళ్ళతో ఉండవచ్చు. పిల్లవాడు తన భావోద్వేగాలను నియంత్రించడం కూడా నేర్చుకుంటాడు. 


2. భావాలు ఏలా ఉంటాయనేది నేర్పండి.

మనసులోని భావాలను వ్యక్తపరడం పిల్లలకు నేర్పండి. ఇది పిల్లవాడి అప్పటి ఫీలింగ్ ను బయటపెట్టేలా చేస్తుంది. ఈసారి కోపం వచ్చినప్పుడు ఆ కోపానికి గల కారణాలు, అలాగే అది ఎప్పుడు పోతుందో చాలా ఈజీగా చెప్పగలుగుతాడు. అప్పుడు కోపంగా కాకుండా మీ ముందు తన భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తాడు. 


3. ప్రశాంతంగా ఉండండి.

పిల్లల కోపానికి కోపంగానే స్పందించకండి. ఇది రెండు వైపుల నుంచి కోపానికి దారితీస్తుంది. పిల్లాడు కోపంగా ఉంటే సమస్య అడిగి తెలుసుకోండి. ప్రేమగా తిరిగి సమాధానం చెప్పండి. 


4. పై చేయి వాళ్ళదే..

చాలామంది పిల్లలు మొండిగా ఉంటారు. తల్లిదండ్రుల మీద ట్రిక్స్ ఫ్లే చేస్తూ ఉంటారు. డిమాండ్స్ నెరవేరకపోతే స్వభావంలో చాలా లోతైన మార్పు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ప్రతిదీ వినకండి. పట్టుదలగా ఉన్న కారణం ఏంటనేది అడిగి తెలుసుకోండి. కోపం తీర్చే వీలుంటే డిమాండ్లు తీర్చడానికి చూడండి. లేదంటే వివరంగా విడమరచి తీర్చలేకపోతున్నందుకు కారణాలు చెప్పండి. 


5. పిల్లలు అర్థం చేసుకుంటారా?

పిల్లలకు ఏది చెప్పినా అర్థం చేసుకుంటారు. కాకపోతే కాస్త నెమ్మదిగా వాళ్ళ లెవెల్ కి అర్థం అయ్యేలా చెప్పుకుంటూ రావాలి. దీనికి చాలా ఓపిక, సహనం తల్లి, తండ్రి ఇద్దరికీ అవసరం.  

Updated Date - 2022-10-18T17:12:32+05:30 IST