శ్రేయోభిలాషి సలహా!

ABN , First Publish Date - 2022-07-07T09:05:26+05:30 IST

ఒక ఊరిలో చాకలి ఉండే వాడు. అతని దగ్గర గాడిద ఉండేది. రోజూ చెరువు నుంచి ఇంటికి బోలెడు బట్టల మూటలు ఆ గాడిదపై తీసుకొచ్చే వాడు.

శ్రేయోభిలాషి సలహా!

క ఊరిలో చాకలి ఉండే వాడు. అతని దగ్గర గాడిద ఉండేది. రోజూ చెరువు నుంచి ఇంటికి బోలెడు బట్టల మూటలు ఆ గాడిదపై తీసుకొచ్చే వాడు. అయితే ఎప్పుడూ కూడా గాడిదకు కడుపు నిండా ఆహారం పెట్టే వాడు కాదు. దాంతో గాడిద బాగా బలహీనపడింది. ఆ సమయంలో ఒకరోజు గాడిదకు నక్క తారసపడింది. బాగా బలహీనంగా ఉన్న గాడిదను చూసి ‘ఏంటి అలా ఉన్నావు? రోజూ తినడం లేదా?’ అని అడిగింది. దాంతో తన కథనంతా చెప్పుకొని ఏడ్చింది గాడిద. మరేం పరవాలేదని తనతో వస్తే దగ్గరలో ఉన్న తోటలో మంచి పండ్లు, కూరగాయలు తినొచ్చని చెప్పింది. తోటలోకి వెళ్లేందుకు ఒక రహస్యమార్గం ఉందని చెప్పింది నక్క. ఆ మాటలు విన్న గాడిద సరేనంది. రెండూ కలిసి తోటలోకి ప్రవేశించి కడుపు నిండా తిని వచ్చేశాయి. అలా రెండు, మూడు రోజులు వరుసగా తోటలోకి దొంగతనంగా ప్రవేశించడం, కడుపు నిండా తిని రావడం చేస్తున్నాయి. ఆహారం బాగా తినడంతో గాడిద మళ్లీ బలిష్టంగా తయారయింది. ఒకరోజు ఎప్పటిలాగే నక్క, గాడిద తోటలోకి వెళ్లి పండ్లు తినడం మొదలుపెట్టాయి. గాడిద కడుపు నిండా తిన్నాక అరవడం మొదలుపెట్టింది. వెంటనే నక్క ‘‘అలా అరిస్తే మనం దొరికిపోతామని అరవకుండా తిను’’ అని చెప్పింది. నక్కమాటను వినకుండా బాగా తిన్నాక నాకు ఇలా అరవడం అలవాటు అంటూ అరవసాగింది. ‘‘నీ శ్రేయోభిలాషిగా చెబుతున్నాను అరవకు, యజమానికి దొరికిపోతే ఇకముందు ఈ ఆహారం దొరకదు’’ అని అంది నక్క. కానీ గాడిద ఆ మాటలు పట్టించుకోలేదు. ఈ అరుపులు వింటే యజమాని వచ్చేస్తారని నక్కకు అర్థమైంది. వెంటనే  అక్కడి నుంచి జారుకుంది. కాసేపటికే గాడిద అరుపులు విన్న యజమాని అక్కడకు చేరుకుని కర్రతో గాడిదను బాదాడు. ఆ దెబ్బలకు గాడిద లేవలేకుండా అయింది. 

Updated Date - 2022-07-07T09:05:26+05:30 IST