ఐదో తరగతి విద్యార్థికి గౌరవ డాక్టరేట్
ABN , First Publish Date - 2022-06-21T16:12:03+05:30 IST
రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన ఐదో తరగతి విద్యార్థి గౌరవ డాక్టర్ పట్టా పొందాడు. పరమకుడి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు దండాయుధపాణి

- బాల మేధావి
ఐసిఎఫ్(చెన్నై), జూన్ 20: రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన ఐదో తరగతి విద్యార్థి గౌరవ డాక్టర్ పట్టా పొందాడు. పరమకుడి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు దండాయుధపాణి కుమారుడు సంతోష్ ఖన్నా (10) ప్రైవేటు మెట్రిక్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. ఏడేళ్ల వయస్సులో కార్ల పేర్లు, తయారీ, ఇంజన్ డిజైన్ వంటి వాటిని వివరించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. బాలుడు ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు ప్రోత్సహించేలా కార్ల మొత్తం పనితీరు, తయారీ విధానం తెలుసుకునేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఈ బాలుడు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ‘కలై కలింజియ కుళందై’ పురస్కారం కూడా అందుకున్నాడు. వీటిలో పాటు కందషష్ఠి కవచం, అరుణగిరినాథన్ గీతాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల పనితీరును కూడా వివరిస్తున్నాడు. బాలుడి ప్రతిభను ప్రశంసిస్తూ ‘యంగెస్ట్ కార్ ఎన్సోక్లోపిడియా ఇన్ ది వరల్డ్’ గౌరవ డాక్టర్ పట్టాను ది యూనివర్శల్ తమిళ్ యూనివర్సిటీ అందజేసింది. వీటితో పాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు 20కి పైగా సర్టిఫికెట్లు ఈ బాలుడు అందుకున్నాడు.