ఇదిగో భూమధ్యరేఖ!

ABN , First Publish Date - 2022-02-26T06:11:39+05:30 IST

మీరు భూమధ్యరేఖ గురించి పాఠ్యపుస్తకాల్లో చదువుకునే ఉంటారు. భూగోళంను రెండు అర్ధగోళాలుగా విడదీసే ఈ రేఖ ఆఫ్రికాలోని చాలా దేశాల గుండా వెళుతుంది.

ఇదిగో భూమధ్యరేఖ!

మీరు భూమధ్యరేఖ గురించి పాఠ్యపుస్తకాల్లో చదువుకునే ఉంటారు. భూగోళంను రెండు అర్ధగోళాలుగా విడదీసే ఈ రేఖ ఆఫ్రికాలోని చాలా దేశాల గుండా వెళుతుంది. అందులో ఉగాండా ఒకటి. ఈ దేశంలో భూమధ్యరేఖ వెళ్లే ప్రాంతాన్ని చూడటానికి పర్యాటకులు విశేషంగా తరలివస్తుంటారు. కంపాలా సిటీకి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న కయాబ్వే అనే ప్రాంతం గుండా ఇది వెళుతుంది. 


భూమధ్యరేఖ వెళ్లే చోట వాటర్‌ ఎక్స్‌పరిమెంట్‌  చూసి తీరాల్సిందే. భూమధ్యరేఖకు ఉత్తరంవైపు ఉత్తరార్ధగోళంగానూ, దక్షిణంవైపు దక్షిణార్ధగోళంగానూ పిలుస్తారని తెలిసిందే. ఇక్కడ ఉత్తరార్థగోళంలో ఒక వాటర్‌ బౌల్‌లాంటిది, దక్షిణార్ధగోళంలో ఒకటి, సరిగ్గా భూమధ్యరేఖపైన మరొకటి ఏర్పాటు చేశారు. 

ఈ బౌల్‌కు దిగువ భాగంలో రంధ్రం ఉంటుంది. బౌల్‌లో నీళ్లు పోసి అందులో ఒక పువ్వును వదులుతారు. ఉత్తరార్థగోళంలో ఏర్పాటు చేసిన బౌల్‌లో పువ్వు గడియారం ముల్లు తిరిగే దిశకు వ్యతిరేక దిశలో(యాంటీ క్లాక్‌వైజ్‌) తిరుగుతుంది. అదే దక్షిణార్ధగోళంలో పువ్వు గడియారం ముల్లు తిరిగే దిశలో(క్లాక్‌వైజ్‌) తిరుగుతుంది. 


మరో ప్రత్యేకత ఏమిటంటే సరిగ్గా భూమధ్యరేఖపై ఏర్పాటు చేసిన బౌల్‌లో వేసిన పువ్వు ఎటువైపు తిరగకుండా నేరుగా నీళ్లతో పాటు రంధ్రంలో నుంచి బయటకు వచ్చేస్తుంది.

సరిగ్గా భూమధ్యరేఖ వెళుతున్న ప్రదేశంలోనే మేకుపైన కోడిగుడ్డు పడిపోకుండా పెట్టడం సాధ్యమవుతుంది. ఇక్కడికొచ్చే పర్యాటకులు కోడిగుడ్డును మేకుపై బ్యాలెన్స్‌ చేస్తూ పెట్టడానికి ఆసక్తి చూపుతుంటారు.

Updated Date - 2022-02-26T06:11:39+05:30 IST