టీకా సృష్టికర్త ఎడ్వర్ట్‌ జెన్నర్‌!

ABN , First Publish Date - 2022-07-13T06:16:09+05:30 IST

ఆయన ఒక ఫిజీషియన్‌, సైంటిస్టు. 17 మే, 1749లో బెర్క్‌లీ, ఇంగ్లండ్‌లో జన్మించారు.

టీకా సృష్టికర్త ఎడ్వర్ట్‌ జెన్నర్‌!

కొవిడ్‌ బారిన పడకుండా కాపాడుకోవడానికి అందరం వ్యాక్సిన్లు తీసుకున్నాం కదా! మరి మొదటగా వ్యాక్సిన్‌ను కనుగొన్నది ఎవరో తెలుసా! ఎడ్వర్డ్‌ జెన్నర్‌. 

ఆయన ఒక ఫిజీషియన్‌, సైంటిస్టు. 17 మే, 1749లో బెర్క్‌లీ, ఇంగ్లండ్‌లో జన్మించారు. అతనికి ఎనిమిది మంది తోబుట్టువులు.

డాక్టర్‌ కావాలన్న కలను నిజం చేసుకోవడానికి పద్నాలుగేళ్ల వయసులోనే స్థానికంగా ఉన్న ఒక సర్జన్‌ దగ్గర సహాయకుడిగా చేరాడు. ఆపరేషన్లలో సహాయపడటమే కాకుండా, మందుల తయారీలోనూ సహాయపడేవాడు. తరువాత తను సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. 

పశువుల నుంచి మనుషులకు సంక్రమించే కౌఫాక్స్‌తో బాధపడుతున్న ఒక వ్యక్తి అతను పనిచేసే డాక్టర్‌ దగ్గరకు వచ్చాడు. కౌఫాక్స్‌ సోకిన వ్యక్తులు స్మాల్‌ఫాక్స్‌ బారినపడకపోవడాన్ని ఎడ్వర్డ్‌ గమనించాడు.

ఈ పరిశీలనే స్మాల్‌ఫాక్స్‌కు వ్యాక్సిన్‌ తయారుచేసేలా తోడ్పడింది. మొట్టమొదట వ్యాక్సిన్‌ తయారుచేసిన పరిశోధకుడిగా చరిత్రలో నిలిచిపోయేలా చేసింది.

ఎడ్వర్ట్‌ జెన్నర్‌కు ఫాదర్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ అని పేరుంది. 

Updated Date - 2022-07-13T06:16:09+05:30 IST