బాతు డైనోసారస్‌!

ABN , First Publish Date - 2022-12-12T23:26:27+05:30 IST

డైనోసారస్‌ అంటే నేల మీద పరుగెత్తుతూ అందరినీ భయభ్రాంతులు చేసే ఒక భీకరమైన ఆకారం గుర్తుకొస్తుంది.

బాతు డైనోసారస్‌!

డైనోసారస్‌ అంటే నేల మీద పరుగెత్తుతూ అందరినీ భయభ్రాంతులు చేసే ఒక భీకరమైన ఆకారం గుర్తుకొస్తుంది. వీటి శరీరం భారీగా ఉండటం వల్ల అవి నీటిలో ఈదలేవని శాస్త్రవేత్తలు భావించేవారు. అయితే తాజాగా నాటోవెనేటర్‌ పోలిడాంటస్‌ అనే ఉపజాతికి చెందిన డైనోసారస్‌ నీటిలో కూడా ఈదేదని శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో తేల్చారు. ఈ తరహా డైనోసారస్‌ల కాళ్లు బాతుల మాదిరిగా నీటిలో ఈదటానికి వీలుగా ఉండేవని కూడా కనుగొన్నారు. ఈ డైనోసారస్‌ కాళ్లు పొడవుగా ఉండేవని అందువల్ల నీటిలో ఈదటం సులభమని పేర్కొన్నారు. గతంలో డైనోసారస్‌లు కేవలం భూమిపైనే సంచరించేవని.. నీటిలో ఈదే సామర్థ్యం వీటికి లేదని భావించేవారు. కానీ తాజా అధ్యయనాల్లో అది తప్పు అని తేలింది.

Updated Date - 2022-12-12T23:26:58+05:30 IST