మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-10-02T08:42:41+05:30 IST

పాంగోలియన్‌ మీద పొలుసులుంటాయి. వీటిని బట్టి సులువుగా పాంగోలియన్లను గుర్తు పట్టొచ్చు.

మీకు తెలుసా?

పాంగోలియన్‌ మీద పొలుసులుంటాయి. వీటిని బట్టి సులువుగా పాంగోలియన్లను గుర్తు పట్టొచ్చు. 

సహారా ఎడారిలో ఎక్కువ ఉంటాయివి. 30 సెం.మీ. నుంచి 100 సెం.మీ పొడవు ఉంటాయి. ఆడ పాంగోలియన్ల కంటే మగ 

పాంగోలియన్లు 40 శాతం పెద్దవిగా ఉంటాయి. 

దీనిమీద ఉండే పొలుసుల నిర్మాణం కెరోటిన్‌తో తయారవుతుంది. మన గోర్లు కూడా కెరోటిన్‌ నిర్మాణమే. పాంగోలియన్ల పొలుసులు గట్టిగా ఉంటాయి. 

దీని తోక పొడవుగా ఉంటుంది. యాక్టివ్‌గా ఉంటుందిది. చెట్టుమీద వేగంగా తిరుగుతుంది. ఇవి స్వతహాగానే నీళ్లలో అద్భుతంగా ఈదుతాయి.

ఇవి రాత్రిపూట తిరుగుతాయి. పగలంతా నిద్రపోతాయి. అప్పుడే ఉండచుట్టుకుని నిద్రపోతాయి. 

వీటి నోరు జిడ్డుగా ఉంటుంది. చీమలు, పురుగుల్ని తన పొడవైన నాలుకతో తింటుంది. వాసన చూసే గుణం బావుంటుంది. అయితే వీటిని చూపు చాలా తక్కువగా ఉంటుంది.

దీన్ని కొందరు తినటంతో పాటు ట్రెడిషనల్‌ మెడిసిన్‌లో ఉపయోగిస్తారు. అందుకే వీటిని దొంగతీసుకెళ్లటం, అమ్మటం చేస్తుంటారు. 

ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో మాత్రమే ఇవి ఉంటాయి. వీటి సంఖ్య గణనీయంగా పెరుగటం విశేషం. శతృవులు వస్తే ఉండలా చుట్టుకుని తనకు తాను రక్షించుకోగల సామర్థ్యం వీటికి ఉంది.

Read more