మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-09-13T09:24:32+05:30 IST

సన్నని పొట్టి ముక్కు నోటిలా ఉపయోగపడుతుంది. దంతాలుండవు. చీమలు, వానపాములు, పురుగులు తిని బతుకుతాయివి.

మీకు తెలుసా?

ఆస్ర్టేలియ, న్యూగినియా ప్రాంతంలో కనిపించే జంతువు ఎకిడ్న. ఇవి చూడటానికి విచిత్రంగా ఉంటాయి. ఒంటిమీద వెంట్రుకలు ఉన్నట్లుండి చివరి భాగంలో గట్టి ముల్లులు ఉండే అరుదైన జీవి ఇది. 


న్నని పొట్టి ముక్కు నోటిలా ఉపయోగపడుతుంది. దంతాలుండవు. చీమలు, వానపాములు, పురుగులు తిని బతుకుతాయివి. వీటి నడక గమ్మత్తుగా ఉంటుంది. వీటి ముక్కుకు ఓ సహజగుణం ఉందండోయ్‌. ముక్కులో వాసనబట్టే సెన్సర్స్‌ లాంటివి ఉంటాయి. మట్టిలో ఉన్నా, చెద పట్టిన చెట్లలో పురుగులు ఉన్నా వెంటనే పసిగడతాయి. తన పొడవైన జిగట నాలుకతో పురుగులను పట్టి తినేస్తాయి. 

కాళ్ల పంజాలు గట్టిగా ఉంటాయి. వాటితో మట్టిని వేగంగా తవ్వుతాయి.

గుడ్లు పెట్టే క్షీరదాలు ఇవి. కేవలం ఒకే గుడ్డు పెడుతుంది. అది పగిలి పిల్ల రావడానికి పదిరోజుల సమయం పడుతుంది.

ఇవి 29 డిగ్రీలనుంచి 32 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలో మాత్రమే జీవిస్తాయి. ఎక్కువ వేడికి తట్టుకోలేవు. 

గ్రీకు మైథాలజీలో సగం మహిళ- సగం పాములా ఉండే జంతువని రాసి ఉంది.

ప్రాణం ఉండే ముల్లుండే ఫుట్‌బాల్‌లా ఉంటుంది ఎకిడ్న. 

Read more