Keel Build Toucan : మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-12-05T23:33:35+05:30 IST

పసుపు, ఆకుపచ్చ, నలుపు, ఆరెంజ్‌, ఎరుపు రంగుల్లో ముక్కు ఉంటుంది. ఆ ముక్కు ఇంద్రధనస్సును తలపిస్తుంది. ఈ అందమైన పక్షి పేరు కీల్‌ బిల్డ్‌ టూకాన్‌.

Keel Build Toucan : మీకు తెలుసా?

పసుపు, ఆకుపచ్చ, నలుపు, ఆరెంజ్‌, ఎరుపు రంగుల్లో ముక్కు ఉంటుంది. ఆ ముక్కు ఇంద్రధనస్సును తలపిస్తుంది. ఈ అందమైన పక్షి పేరు కీల్‌ బిల్డ్‌ టూకాన్‌. రైన్‌బో టూకాన్‌ అని కూడా పిలుస్తారు.

దక్షిణ అమెరికా, దక్షిణ మెక్సికో, కరీబియన్‌ అడవుల్లో ఎక్కువగా ఉంటాయివి. చెట్టు తొర్రల్లో, ఇతర పక్షుల గూళ్లలో జీవిస్తుంటాయి. పురుగులు, బల్లులు, ఇతర పక్షుల గుడ్లు, పండ్లు తింటాయి.

ఇవి రెండు నుంచి 4 గుడ్లు పెడతాయి. 20 రోజులు పొదుగుతాయి.

ఈ పక్షికి ముక్కు అందం. శరీరం 50 సెం.మీ పొడవుంటే అందులో 20 సెం.మీ. ముక్కు ఉంటుంది. ఇది అందమైనది. సున్నితమైనది కూడా. ఈ ముక్కుతో గొడవపడటం, మట్టిని తవ్వడం చేయలేదు. దక్షిణ అమెరికాలోని చెట్లమధ్య సులువుగా జీవించటానికి వీలుండేట్లు డిజైన్‌ అయిందా అన్నట్లు అనిపిస్తుంది. ఇవి నలభై జాతులున్నాయి.

వీటి రెక్కలతో ఇవి పైకి ఎగరలేవు. ఒక చెట్టుమీద నుంచి మరో చెట్టు మీదకు ఎగురుతాయంతే.

20 ఏళ్లు జీవిస్తాయి.

Updated Date - 2022-12-05T23:33:37+05:30 IST