మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-12-07T22:42:52+05:30 IST

సముద్రంలోని డాల్ఫిన్‌ జాతికి చెందిన ఈ జంతువును ‘ఓర్కా’ అంటారు. దీన్ని కిల్లింగ్‌ వేల్‌, సీ ఊల్ఫ్‌, బ్లాక్‌ ఫిష్‌ అనే పేర్లతో పిలుస్తారు.

మీకు తెలుసా?

సముద్రంలోని డాల్ఫిన్‌ జాతికి చెందిన ఈ జంతువును ‘ఓర్కా’ అంటారు. దీన్ని కిల్లింగ్‌ వేల్‌, సీ ఊల్ఫ్‌, బ్లాక్‌ ఫిష్‌ అనే పేర్లతో పిలుస్తారు.

ఆర్కిటిక్‌, అంటార్కిటిక్‌ సముద్రాలనుంచి ట్రాపికల్‌ సముద్రం వరకూ తిరుగుతుంటుంది. సముద్రం లోపలినుంచి పారాచూట్‌లా గాలిలోకి ఎగిరి మళ్లీ లోపలికి దుముకుతూ ఉంటుందిది.

మగ ఓర్కాలు 32 అడుగులు, ఆడవి 27 మీటర్ల పొడవుంటాయి. ఎంత దూరమైనా సరే ఈదుతూనే ఉంటాయి. వీటికి అలసట రాదా అనిపిస్తుంది. అంతటి శక్తిగల జీవులివి. గంటకు 54 కి.మీ వేగంతో సముద్రంలో ఈదుతాయి.

ఒక యుక్తవయసు ‘ఓర్కా’ కనీసం పదకొండు టన్నుల బరువు ఉంటుంది.

పక్షులు, తాబేళ్లు, చేపలు, సీల్స్‌. పెంగ్విన్‌లను వేటాడి తింటాయి. వేటాడటంలో టెక్నిక్‌ అద్భుతంగా ఉంటుంది.

ఇవి గుంపుగా ఉంటాయి. సీ లయన్‌ అని కూడా వీటిని పిలుస్తారు. గుంపులుగా జీవిస్తాయి. 5 నుంచి 50 వరకూ ఒకేచోట ఉంటాయి.

వీటి సగటు జీవించే కాలం ముప్పయి ఏళ్లు.

Updated Date - 2022-12-07T22:42:53+05:30 IST