మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-11-30T22:54:50+05:30 IST

సముద్రం చుట్టూ ఇసుక తిన్నెలుంటాయి. అయితే ఆస్ర్టేలియాలోని వెస్ట్‌కోస్ట్‌ ప్రాంతంలో ఉండే సముద్రం దగ్గర 70 కిలోమీటర్లు ఏకంగా గవ్వల గుట్టలే ఉంటాయి. దీన్నే ‘షెల్‌ బీచ్‌’ అని పిలుస్తారు.

మీకు తెలుసా?

సముద్రం చుట్టూ ఇసుక తిన్నెలుంటాయి. అయితే ఆస్ర్టేలియాలోని వెస్ట్‌కోస్ట్‌ ప్రాంతంలో ఉండే సముద్రం దగ్గర 70 కిలోమీటర్లు ఏకంగా గవ్వల గుట్టలే ఉంటాయి. దీన్నే ‘షెల్‌ బీచ్‌’ అని పిలుస్తారు. దూరం నుంచి చూస్తే మెరిసిపోతుంటాయి. ఉదయం సూర్యరశ్మి పడినప్పటినుంచి నీలిరంగు సముద్రానికి తెల్లని హారం వేసినట్లుంటుందా ప్రదేశం.

ఈ గవ్వలు మొలస్కా జీవుల జాతికి చెందినవి. ఇవి పది మీటర్ల లోతువరకూ ఉంటాయి. కోట్ల షెల్స్‌ను ఒకేచోట ఉండటంతో వీటిని చూడటానికి విహార యాత్రికులు ప్రత్యేకంగా వస్తుంటారు. ముఖ్యంగా పిల్లలతో ఇక్కడ ఇసుకగూళ్ల మాదిరే గవ్వల గూళ్లు కట్టుకుంటుంటారు. 1990ల్లో వీటితోనే ఇటుకలు చేసి రెస్టారెంట్‌ కట్టారు. ఇది ఇప్పటికీ దృఢంగా ఉంది. ఇటుకలతోనే నిర్మాణం చేసినట్లుంటుంది. మొలస్కా జీవుల రకానికి చెందినవి ఈ గవ్వలు. మొత్తానికి వాతావరణ మార్పుల కారణంగా ఈ గవ్వల బీచ్‌ ఏర్పడిందంటారు శాస్త్రవేత్తలు. వరల్డ్‌ హెరిటేజ్‌ ఏరియాగా యునెస్కో 1991లో గుర్తించింది.

Updated Date - 2022-11-30T23:00:31+05:30 IST

Read more