Caribou antelope: మీకు తెలుసా?
ABN , First Publish Date - 2022-12-14T22:18:04+05:30 IST
ఒక చెట్టు కొమ్మలా, ఎండిన కొమ్మల మాదిరి కొమ్ములుండే జింక జాతికి చెందిన ఈ జంతువును కరిబు అంటారు(వీటినే రెన్ డీర్ అంటారు). పదుల సంఖ్యలో వీటి జాతి ఉంది.
ఒక చెట్టు కొమ్మలా, ఎండిన కొమ్మల మాదిరి కొమ్ములుండే జింక జాతికి చెందిన ఈ జంతువును కరిబు అంటారు(వీటినే రెన్ డీర్ అంటారు). పదుల సంఖ్యలో వీటి జాతి ఉంది. అయితే కరిబు మాత్రం ఉత్తర అమెరికా, కెనడా, రష్యా దేశాల్లో గుంపులు గుంపులుగా ఉంటాయి. గుంపులంటే పదో ఇరవయ్యో కాదు వందలు, వేల సంఖ్యలో అనమాట!
ఇవి కొట్లాటకంటే ఇతర జీవులతో ప్రేమగా ఉండటానికి ఇష్టపడతాయి. అడవిలో జంతువులన్నీ ఇతర జీవుల మీదకు దాడి చేస్తుంటే.. రోజంతా గడ్డిని కొరుకుతూ కనిపిస్తాయివి. రోజుకు మూడు కిలోల గడ్డిని తింటాయి. అయితే క్రూరమృగాలు అన్నింటికి ఇవి విందుభోజనంలా ఉపయోగపడతాయి. మనుషులు కూడా వేటాడి తింటారు.
వీటి చర్మం మీద మరో కోట్‌లా జుట్టు ఉంటుంది. గడ్డకట్టే చలిగాలుల మధ్య బతుకుతాయి. అదే సమయంలో ఒక ప్రాంతం నుంచి వందల కిలోమీటర్లు వలస వెళ్లటానికి ఇష్టపడతాయి. ఆ మధ్యలో నదులు అడ్డమొచ్చిన వేగంగా ఈదుతూ దాటుకుంటాయి. కనీసం సంవత్సరానికి 4800 కిలోమీటర్లు ఇవి తిరుగుతాయి. వలస వెళ్లినచోట పిల్లలు కని తిరిగి తన స్థావరాలకు చేరుకుంటాయి. ఒక్కో కరిబు సంవత్సరానికి ఒక బిడ్డకు మాత్రమే జన్మనిస్తుంది.
కరిబు కడుపులో నాలుగు గదులుంటాయి. గడ్డి మింగిన వెంటనే ఒక గదిలోకి వెళ్తుంది. అక్కడనుంచి రెండో గదిలోకి వెళ్లి స్టోర్ అవుతుంది. మూడో గదిలో మాత్రం గ్రైండ్ అవుతుంది. నాలుగో గదిలో అది న్యూట్రిన్ల రూపంలో నిల్వ ఉంటుంది. అది శరీరం పీల్చుకుంటుంది. అయితే ఇవి ఎడారిలో ఉన్నపుడు, వాటికి ఆహారం దొరకనపుడు మాత్రమే ఈ ఫోర్ చాంబర్స్ వల్లనే ఇది చాలా కాలం బతుకుతుంది.
వాతావరణం అనుగుణంగా అంటే చలికాలంలో వీటి గిట్టలకు ఒక షూలాగా లేయర్స్ ఉంటాయి. మంచుగుట్టల మధ్య వందల కిలోమీటర్లు నడుస్తాయి. విచిత్రమేంటంటే దీని శరీరం ఎండ, చలికి అనుగుణంగా మారిపోతుంది.