Giraffe: దొంగ దొరికాడు!

ABN , First Publish Date - 2022-12-15T22:07:49+05:30 IST

ఒక అడవిలో జిరాఫీ ఉండేది. అది బహు సిగ్గరి. సోమరిపోతు. జంతువులన్నీ వేటకు వెళ్తోంటే ఇంటి దగ్గర పడుకునేది. ఇతరులతో మాట్లాడకుండా గమ్మున ఉండిపోయేది.

Giraffe: దొంగ దొరికాడు!

కథ

ఒక అడవిలో జిరాఫీ ఉండేది. అది బహు సిగ్గరి. సోమరిపోతు. జంతువులన్నీ వేటకు వెళ్తోంటే ఇంటి దగ్గర పడుకునేది. ఇతరులతో మాట్లాడకుండా గమ్మున ఉండిపోయేది. ఒక రోజు దారింటా వెళ్తోంటే అరటిచెట్టు కనిపించింది. గెలలు చూస్తూనే తినాలపించింది జిరాఫీకి. సులువుగా గెలను తెంపి తినేసింది. ఆ అరటి చెట్ల యజమాని అయిన ఎలుగుబంటి ఇంటికి వచ్చిన తర్వాత చూసింది. అరే ఇంటి చుట్టూ వైర్‌తో కట్టాను. అయినా కూడా అరటి గెలలు తెంపేశారు. ఇది జిరాఫీనే చేసి ఉంటుంది అని అనుమానపడింది. జిరాఫీ దగ్గరకు వెళ్లి అడిగింది. ‘నాకు తెలీదు అంది’ జిరాఫీ. కిమ్మనకుండా ఇంటికి వచ్చింది ఎలుగు.

మరుసటి రోజు ఎలుగుబంటి స్నేహితుడు కోతి వచ్చింది. విషయం తెలుసుకుంది. ఇద్దరూ వెళ్లి మెకానిక్‌ దగ్గరకు వెళ్లి పాత టైర్లు కొనుక్కొచ్చారు. చెట్టు దగ్గర అరటి గెలల ముందు వేలాడదీశారు. ఇందుకోసం కోతి తన స్నేహితుడికి సాయపడింది. మరుసటి రోజు ఎలుగుబంటి తన పనిలో తాను వెళ్లిపోయింది. జిరాఫీ అక్కడికి వెళ్లింది. అరటి గెల గట్టిగా లాగిందో లేదో టైర్‌ వచ్చి జిరాఫీ గొంతుమీదకు వచ్చింది. పొడవైన గొంతు.. వెనక్కి తీయలేకపోయింది. బాధతో పరిగెత్తింది. ఇంటికొచ్చాక ఎలుగు చూసింది. ఈసారి వెంటనే మళ్లీ జిరాఫీ ఇంటికి వెళ్లింది. జిరాఫీ ఇంటి దగ్గర చింతిస్తూ ఉంది. ఎలుగు వెంటనే కోతి కూడా వెళ్లింది. ‘ఈ టైర్‌ మా చెట్టు దగ్గర వేలాడదీశాను. నీ దగ్గరకు వచ్చింది’ అన్నది ఎలుగుబంటి. జిరాఫీ సిగ్గుతో తలదించుకుంది. తన తప్పును అంగీకరించింది. దొంగ దొరికే ఆలోచన ఇచ్చినందుకు తన స్నేహితుడిని మెచ్చుకుంది ఎలుగు.

Updated Date - 2022-12-15T22:07:51+05:30 IST